ప్రస్తుతం పూజ హెగ్డే - రష్మిక టాలీవుడ్ టాప్ పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ సరసన నటిస్తున్న పూజ హెగ్డే, రష్మిక ఇద్దరూ ఒకేసారి పాన్ ఇండియా మూవీస్ లో నటించారు. అటు రష్మిక పుష్ప పార్ట్1 తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే హిట్ కొట్టింది. ఇక పూజ హెగ్డే రాధే శ్యామ్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి వచ్చింది. కానీ పూజ హెగ్డే కి రాధే శ్యామ్ షాకిచ్చింది. ఆ సినిమా టాక్ తో పూజ సైలెంట్ అయ్యింది. ఇక రష్మిక కి శర్వానంద్ సరసన చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు తో షాక్ తిన్నది. ఆ సినిమా రశ్మికకి డిజాస్టర్ ఇచ్చినా.. అది జస్ట్ తెలుగుకే పరిమితమైంది కాబట్టి ప్రాబ్లెమ్ లేదు.
కానీ పూజ హెగ్డే కి పాన్ ఇండియా అంటే ఐదు భాషల్లో రాధే శ్యామ్ మాత్రం కోలుకోలేని షాక్ ఇచ్చినా.. ఆమెకి ప్రస్తుతం మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చేతిలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించబోతుంది అనే టాక్ కూడా ఉంది. సో పూజ కి టాలీవుడ్ లో ఫికర్ లేదు. ఇక రష్మిక పుష్ప పార్ట్ 2 కోసం రెడీ అవుతుంది. అటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ పూజ హెగ్డే, రష్మిక ఇద్దరూ బిజీగానే ఉన్నారు. సో ఇక్కడ టాప్ ఎవరు అనేది ఆడియన్స్ డిసైడ్ చెయ్యాలి.. లేదంటే దర్శకనిర్మాతలు వాళ్ళకిచ్చే ఆఫర్స్ ని బట్టి డిసైడ్ అవ్వాలి.. గ్లామర్ గర్ల్ పూజ హెగ్డే టాప్ అనేది, లేదా లక్కీ హీరోయిన్ రష్మిక టాప్ అనేది.