ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆర్.ఆర్.ఆర్ మ్యానియాతో కొట్టుకుపోతుంది. అటు తారక్ ఫాన్స్, ఇటు చరణ్ ఫాన్స్ ఇద్దరూ చేసే హడావిడి, హంగామా అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏదో ఒక హీరో అయితే కూల్ గా పబ్లిసిటి చేసుకుంటారు ఆ హడావిడే వేరు. కానీ ఇక్కడ ఇద్దరు హీరోల ఫాన్స్ మధ్యన పోటీ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మా హీరో ప్రమోషన్స్ గొప్ప అంటే మా హీరో ప్రమోషన్స్ గొప్ప అంటూ ఇరువురి ఫాన్స్ చేసే హంగామాతో సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ ని, తారక్ ఫాన్స్ తారక్ ని హైలెట్ చేసుకుంటున్నారు.
రామ్ చరణ్ ఫాన్స్ అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం చిక్కబళ్లాపూర్ లో చెయ్యబోయే ఈవెంట్ ఇండియా లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించబోతున్నారు. అందుకోసం ఇప్పటినుండే ఏర్పాట్లను మొదలు పెట్టేసారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ ఒకటి దుబాయ్ లో ప్లాన్ చేసినప్పటికీ.. అది జరుగుతుందో.. లేదో అనే డౌట్ లోనే ఉంది. కానీ మార్చ్ 20 న చిక్కబళ్లాపూర్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుంది అని, అందరూ మాట్లాడుకునే విధంగా ఆ ఈవెంట్ ఉంటుంది అని, ఈ ఈవెంట్ లో ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం హాజరవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.