Advertisementt

పవన్ భవదీయుడు అదిరిపోయే అప్ డేట్

Wed 16th Mar 2022 12:52 PM
pawan kalyan,harish shankar,hari hara veeramallu,krish,bhavadeeyudu bhagat singh movie,bhavadeeyudu bhagat singh shoot starts soon  పవన్ భవదీయుడు అదిరిపోయే అప్ డేట్
Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Shoot Starts Soon పవన్ భవదీయుడు అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ అవువుద్ది అనగానే పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. భీమ్లా నాయక్ తో బాక్సాఫీసు దగ్గర భారీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల షూటింగ్స్ తో బిజీగా వుంటున్నారు. క్రిష్ తో చెయ్యాల్సిన హరి హర వీరమల్లు షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడింది. మార్చ్ చివరి వారం నుండి హరి హర వీరమల్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మూవీ కోసం హారిష్ శంకర్ ప్రోపర్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని, స్టార్ కాస్ట్ ను సెట్ చేసుకుని సెట్స్ మీదకి వెళ్లాలని చూస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ లో ఓ పవర్ ఫుల్ కేరెక్టర్ కోసం పంకజ్ త్రిపాఠి ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా జూన్ చివరి వారం నుండి పట్టాలెక్కబోతుంది అనేది లేటెస్ట్ గా తెలుస్తున్న న్యూస్. హరీష్ శంకర్ జూన్ ఎండ్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి జులై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ పెట్టుకోవాలని, ఈలోపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది అని భావిస్తున్నారట. ఇక భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ గా కనిపిస్తారని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే ని ఎంపిక చేయబోతున్నారని తెలుస్తుంది.  

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Shoot Starts Soon:

Bhavadeeyudu Bhagat Singh update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ