Advertisementt

పిక్ టాక్: కొత్త యాంగిల్స్ కి రకుల్ రెడీ

Wed 16th Mar 2022 11:39 AM
rakul preet,rakul preet new glamour pic rakul preet singh,rakul new photo  పిక్ టాక్:  కొత్త యాంగిల్స్ కి రకుల్ రెడీ
Rakul New Glamour pic viral పిక్ టాక్: కొత్త యాంగిల్స్ కి రకుల్ రెడీ
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ కి ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ లు లేవు. కొండ పొలం ఇచ్చిన షాక్ కి రకుల్ ని టాలీవుడ్ పూర్తిగా దూరం పెట్టేసింది. బాలీవుడ్ లో నాలుగైదు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. అందులో ఈ ఏడాది రెండు సినిమాలతో నార్త్ ఆడియన్స్ ముందుకు రాబోతున్న రకుల్.. బాలీవుడ్ లో జాకీ భగ్నానీ ప్రేమలో మునిగి తేలుతుంది. జాకీ తో చట్టాపట్టాలేసుకుని మాల్దీవులకు వెళ్లొస్తుంది. టాలీవుడ్ లో కొండపోలం డిజాస్టర్ అవడంతో షాక్ తిన్న రకుల్.. ఇంతకు ముందులా కోట్లు డిమాండ్ చేయకున్నా సరైన సినిమా కోసం ఎదురు చూస్తుంది. తెలుగులో మంచి కాంబినేషన్, మంచి డైరెక్టర్ పడితే రేటు తగ్గించుకోవడానికి, వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేసెయ్యడానికి రెడీగా ఉంది.

ఇప్పుడు రకుల్ ప్రీత్ వెబ్ సీరీస్ ల వైపు కూడా ఓ కన్నేసింది. ఒక వైపు సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తో మంచి పేరు తెచ్చుకోవడం, రాసి ఖన్నా, తమన్నా, తాప్సి, కాజల్, రీసెంట్ గా శృతి హాసన్ లాంటి టాప్ హీరోయిన్స్ అందరూ కూడా వెబ్ సీరీస్ ల వైపు వెళ్లడంతో తాను కూడా మంచి సబ్జెక్టు దొరికితే వెబ్ సీరీస్ లోకి దూకుదామని రెడీగా ఉంది. ఇక రకుల్ ప్రీత్ గ్లామర్ గానే కాకుండా పెరఫార్మెర్ గా తనలోని కొత్త యంగిల్స్ చూపించేందుకు రెడీ అయ్యింది అనేలా ఉంది ఆమె ప్రస్తుత వ్యవహారం. 

Rakul New Glamour pic viral:

Rakul preet Glamour pic goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ