Advertisementt

బిగ్ బాస్ ఓటిటి విన్నర్ డిసైడ్: కౌశల్

Wed 16th Mar 2022 11:01 AM
kaushal manda,bigg boss non stop,bigg boss telugu ott,bigg boss ott,bigg boss non stop winner,bindu madhavi  బిగ్ బాస్ ఓటిటి విన్నర్ డిసైడ్: కౌశల్
Kaushal Manda comments on Bigg Boss non stop winner బిగ్ బాస్ ఓటిటి విన్నర్ డిసైడ్: కౌశల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 2 లో ఎవరూ ఊహించని విధంగా టైటిల్ విన్నర్ గా మారి తనకో ఆర్మీని ఏర్పాటు చేసుకుని తర్వాత గొప్పలు పోయి.. కెరీర్ లో ఎదురీదుతున్న కౌశల్ మండా.. బిగ్ బాస్ ఓటిటి ని ఫాలో అవుతున్నట్టుగా బిగ్ బాస్ ఓటిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన దృష్టిలో బిగ్ బాస్ ఓటిటి నుండి విన్నర్ గా ఒకరిని సలెక్ట్ చెయ్యడమే కాదు.. ఆ పేరుని తన ఇన్స్టా పేజీ లో స్టోరీస్ లో పోస్ట్ చేసారు. బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నారని, బిగ్ బాస్ గేమ్ ని అర్ధం చేసుకోవడంలో వారు ఇంకా తడబడుతున్నారని చెప్పిన కౌశల్.. ఈసారి ఓటిటి లో బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని.. ఆమె గేమ్ ఆడిన కొన్ని ప్రోమోస్ చూసాను అని, బిందు మాధవి యాటిట్యూడ్, ఆమె టాస్క్ ల్లో పెట్టె బలం, ఆమె సామర్ధ్యం అన్ని ఆవిడే బిగ్ బాస్ విన్నర్ అని డిసైడ్ చేస్తున్నాయని.. ఈసారి బిందు మాధవినే బిగ్ బాస్ ఓటిటి విన్నర్ అవుతుంది అంటూ మూడు వారాలు పూర్తి కాకముందే కౌశల్ విన్నర్ గురించి తనేం అనుకుంటున్నాడో మట్లాడేస్తున్నాడు.

Kaushal Manda comments on Bigg Boss non stop winner:

Kaushal Manda Predicts Bigg Boss Non Stop Winner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ