Advertisementt

స్టేజ్ పై జబర్దస్త్ వర్ష కి అవమానం, కన్నీళ్లు

Tue 15th Mar 2022 10:05 PM
etv,holi special event,rang de program,jabardasth varsha,ram rpasad,hyper aadi,bhasker  స్టేజ్ పై జబర్దస్త్ వర్ష కి అవమానం, కన్నీళ్లు
Holi Special Event - Rang De Latest Promo స్టేజ్ పై జబర్దస్త్ వర్ష కి అవమానం, కన్నీళ్లు
Advertisement
Ads by CJ

సీరియల్స్ నుండి జబర్దస్త్ స్టేజ్ పైకి గ్లామర్ భామగా అడుగుపెట్టి.. కమెడియన్ ఇమ్మాన్యువల్ తో లవ్ ట్రాక్ వేసుకుంటూ.. భాస్కర్ స్కిట్స్ తో పాపులర్ అయిన వర్ష.. ఇప్పడూ ఈ టివి లో వస్తున్న ఫెస్టివ్ ప్రోగ్రామ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో తెగ హడావిడి చేస్తుంది. చెట్టుకి చీరకట్టినట్టు ఉంటుంది. వర్ష కూడా లేడీ గెటప్ వేసిన అబ్బాయిలా ఉంటుంది అంటూ ఫన్నీ సెటైర్స్ వేస్తుంటారు.. స్కిట్స్ లో. అలాంటి వాటిని లైట్ గా తీసుకుని ఎంజాయ్ చేసే జబర్దస్త్ వర్ష ఆదివారం ప్రసారం కాబోయే రంగ్ దే హోలీ ప్రోగ్రాం లో స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది.

కారణం హైపర్ ఆది, ఇమ్మాన్యువల్ తనని అబ్బాయి అంటూ కామెంట్ చెయ్యడంతో వర్ష ఆ స్కిట్ నుండి అలిగి వెళ్ళిపోయినట్టుగా వదిలిన ప్రోమో యూట్యూబ్ లో హైలెట్ అయ్యింది. వర్ష.. ఆది, రామ్ ప్రసాద్ దగ్గరకి వచ్చి ఆ మగవాళ్లందరూ మమ్మల్ని తొక్కెయ్యాలనుకుంటున్నారు.. అనగానే హైపర్ ఆది సాటి మగాడిగా ఆలోచించారా అందులో తప్పేముంది అంటూ వర్షాని కామెంట్ చేసాడు. తర్వాత ఇమ్మాన్యువల్ ఆట లో భాగంగా వర్ష బేసిక్ గా అమ్మాయిల్లో ఉండకూడదు. ఇక్కడ ఉండాలి.. ఎందుకంటే ఆమె మగాడిలా ఉంటుంది అంటూ నవ్వుతూ ఆటపట్టించేసరికి వర్ష కి కోపం వచ్చింది.

తర్వాత భాస్కర్ కూడా మాటిమాటికి ఆ పదం వాడకురా.. ఆమె మగాడా అని నా భార్య అడిగింది.. లేడీ గెటప్పా అని అడుగుతున్నారురా అన్నాడు. దానితో ఏదో ఒకేసారి మాటాడొచ్చు కానీ ప్రతిసారి మగాడు మగాడు అంటే కుదరదని స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. రామ్ ప్రసాద్ వర్షకి సారి చెప్పారా ఇమాన్యువల్ అనగా.. దానికి ఇమ్ము కాదన్నా నేను ఎందుకు చెప్పాలన్నా సారి, నన్ను ఎన్నిసార్లు అనలేదు అన్నాడు. కానీ వర్ష నువ్ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి వేరే మాట్లాడకు అంటూ ఆ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది.

Holi Special Event - Rang De Latest Promo:

Holi Special Event - Rang De Latest Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ