రామ్ చరణ్ - ఎన్టీఆర్ పేరున్న స్టార్ హీరోలు. ఇద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారు అనగానే.. ఇద్దరి అభిమానుల్లో టెంక్షన్ ఉంటుంది. ఎవరికి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరి కేరెక్టర్ తెరపై హైలెట్ అవుతుంది అని. అదే అనుమానం, ఆత్రుత, ఆసక్తి ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ ఇద్దరిలోనూ ఉంది. రాజమౌళి ఎప్పటికప్పుడు ఓ ఫైట్ ఒకరికి, ఓ సాంగ్ ఒకరికి అని నేను రాసుకోలేదు.. ఇద్దరి స్టార్స్ ఫాన్స్ సినిమా చూస్తున్నంతసేపు ఏది గుర్తుకు రాదు.. అంతలా సినిమాలో లీనమైపోతారంటూ ఎంత సర్ది చెప్పినా.. ఫాన్స్ లో ఈగో మాత్రం చల్లారడం లేదు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేదాని మీద ఇంకా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ కి ఎందుకు కొమరం భీం, అల్లూరి పాత్రలు ఇచ్చారో వివరించారు. చరణ్ ది సాధు స్వభావం. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఎంతటి సంఘర్షణ అయినా ఆయన తనలో దాచుకోగలడు. అల్లూరిలోను అవే లక్షణాలు కనిపించాయి. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తొణకడు.. అందువల్లనే ఆ పాత్రలో చరణ్ ను తీసుకున్నాను. ఇక ఎన్టీఆర్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. ఎలాంటి ఫీలింగ్ దాచుకోలేడు, ఏ మాత్రం ఆవేశం వచ్చినా వెంటనే బయటపడిపోతాడు. ఎన్టీఆర్ అమాయకత్వం కొమరం భీమ్ పాత్రకి దగ్గరగా ఉండటం వలన ఆ కేరెక్టర్ కి ఎన్టీఆర్ ని తీసుకున్నాను అంటూ వివరించారు. సో ఇప్పటికైనా ఫాన్స్ అర్ధం చేసుకుంటే బెటర్ లేదంటే థియేటర్స్ దగ్గర రచ్చే.