ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ గత శుక్రవారం విడుదలై.. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ .. క్రమంగా రాధే శ్యామ్ కి ప్లాప్ టాక్ పడడం, సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ప్లాప్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. మొదటి రోజు నుండే రాధే శ్యామ్ కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి. నార్త్ లో ప్రభాస్ క్రేజ్ రాధే శ్యామ్ తో ఏ మాత్రం పని చెయ్యలేదు. వీకెండ్ దాటినా సింగిల్ డిజిట్ తోనే రాధే శ్యామ్ కలెక్షన్స్ హిందీలో ఉన్నాయంటే.. అక్కడ సినిమాని నార్త్ ఆడియన్స్ ఎంతగా తిరస్కరించారనేది అర్ధమవుతుంది. వీకెండ్ లోనే అతి కష్టంగా ఉన్న కలెక్షన్స్ సోమవారం, వచ్చేసరికి మరింతగా డల్ అయ్యాయి. రాధే శ్యామ్ పెరఫార్మెన్స్ సోమవారం అంతంతమాత్రంగానే కనిపించింది.. రాధే శ్యామ్ 4 డేస్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం - 23.26
సీడెడ్ - 6.95
ఉత్తరాంధ్ర - 4.48
ఈస్ట్ - 4.02
వెస్ట్ - 3.11
గుంటూరు - 4.22
కృష్ణా - 2.46
నెల్లూరు - 2.00
ఏపీ, తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 50.50 కోట్లు
కర్ణాటక - 4.10
తమిళనాడు - 0.68
కేరళ - 0.15
హిందీ - 7.50
రెస్టాఫ్ ఇండియా - 1.48
ఓవర్సీస్ - 10.90
4 డేస్ వరల్డ్ వైడ్ టోటల్: 75.75 కోట్లు షేర్