అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు.. హిందీ మర్కెట్ లో 100 కోట్లు కొల్లగొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. పుష్ప కి ముందు నుండే అల్లు అర్జున్ కి బాలీవుడ్ కి కనెక్షన్ ఉంది. ఆయన యాక్షన్ ఫిలిమ్స్ కి హిందీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నారు అందరూ.. కానీ అల్లు అర్జున్ ఉన్నట్టుండి ముంబై వెళ్లి అక్కడ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ఈ రోజు సోమవారం సంజయ్ లీలా భన్సాలీని ముంబై లోని ఆయన ఆఫీస్ లోనే కలిశారు.
బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ అంటే ఓ రేంజ్ ఉంది. ఆయన సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. దేవదాస్, భాజీ రావ్ మస్తానీ, పద్మవత్, రీసెంట్ గా గంగూభాయ్ కతీయవాడి లాంటి డిఫ్రెంట్ మూవీస్ తో ఆయనకంటూ ప్రత్యేకమయిన ఇమేజ్ ఉంది. అలాంటి టాప్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మీటింగ్ అంటే ఆలోచించాల్సిందే. పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలీ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా? అందుకే అల్లు అర్జున్ ప్రత్యేకంగా ముంబై వెళ్లి ఆయన్ని మీటయ్యారా? పుష్ప తర్వాత అల్లు అర్జున్ చెయ్యాల్సిన ఐకాన్ ఉంటుందో.. లేదో.. డౌట్. అలాగే కొరటాలతో అల్లు అర్జున్ చెయ్యాల్సిన పాన్ ఇండియా మూవీ ఆగిపోయింది. సో పుష్ప తర్వాత అల్లు అర్జున్ డైరెక్ట్ గా బాలీవుడ్ ఫిలిం చెయ్యడానికి రెడీ అవ్వడంతోనే ఆయన సంజయ్ లీలా ని మీట్ అయ్యుంటారనే ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ - సంజయ్ లీలా మీటింగ్ పైనే అందరి చూపు. అల్లు అర్జున్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబో త్వరలోనే చూస్తామేమో..