ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ విషయంలో పట్టుబట్టి మరీ సినిమా ఇండస్ట్రీ ని ఓ దారికి తెచ్చుకుంది. పెద్ద పెద్ద హీరోలని తన దగ్గరకి రప్పించుకుని జగన్ ఈగో శాటిస్ ఫై చేసుకున్నాకే జగన్ గారు ఇండస్ట్రీ సమస్యలను పట్టించుకుంటున్నారు. లేదంటే జగన్ గారు పేద ప్రజలకి తక్కువ ధరలకే ఎంటెర్టైనెంట్న్ అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కానీ చిరు, మహేష్, ప్రభాస్ వెళ్లి అడిగేసరికి జగన్ ఈగో శాటిస్ ఫై అయ్యింది. కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విషయంలో కావాలనే జీవో జారీ చెయ్యకుండా పవన్ ని రెచ్చగొట్టారు. అదే రాధే శ్యామ్ విషయం వచ్చేటప్పటికి.. టికెట్ రేట్స్ పెంచుకునే జీవో జారీ చేసింది.
అయితే మార్చ్ 25 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం రాజమౌళి, నిర్మాత దానయ్యలు ప్రత్యేకంగా అమరావతికి వెళ్ళి సీఎం జగన్ ని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. అంటే రాజమౌళి, దానయ్యలు ఆర్.ఆర్.ఆర్ పెద్ద మూవీ, టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం, అలాగే బెన్ఫిట్ షో ల అనుమతి కోసమే జగన్ ని మీటయ్యారని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ నుండి గన్నవరం వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కడి నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి రాజమౌళి, దానయ్యలు దాదాపుగా గంట సేపు జగన్ తో సమావేశమై తిరిగివచ్చారు. ఎయిర్ పోర్ట్ లో జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పిన రాజమౌళి.. మీడియా అడిగింది ఏ ప్రశ్నకు ఆయన స్పందించలేదు.
రాజమౌళి అటు వెళ్లారో లేదో ఇలా మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. రాజమౌళి అడిగారని టికెట్ రేట్స్ పెంచరు, టిక్కెట్ ధరలు ప్రభుత్వం నిర్ణయించినట్లే ఉంటాయి, అలాగే ఐదో షో కి అనుమతి ఉన్నా చిన్న సినిమా ప్రదర్శించాలి, బెన్ఫిట్ షోలకి అనుమతి లేదు, ఇక్కడ ఎవరైనా ఒక్కటే.. రాజమౌళి ఏం స్పెషల్ కాదు అన్నట్టుగా మాట్లాడారు పేర్నినాని.