ఆర్.ఆర్.ఆర్ సెలెబ్రేషన్స్ ఆంథెమ్ రావడానికి కొద్దిగా లేట్ అయినా.. వచ్చాక మాత్రం దుమ్ము దులిపేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ఒకరికొకరు పోటీ పడి మరీ ఆ సాంగ్ లో ఎక్సప్రెషన్స్ తో, డాన్స్ స్టెప్స్ తో ఇరగదీసారు. ఎన్టీఆర్ స్మైల్, రామ్ చరణ్ ఎక్సప్రెషన్స్, అలియా భట్ అందం, ఆ గ్రేస్ ఫుల్ నెస్ అన్ని అద్భుతః. చరణ్, ఫాన్స్ కి ఎన్టీఆర్ ఫాన్స్ కి రాజమౌళి పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఈ సాంగ్ తో అందరిలో ఆసక్తి, ఆత్రుత అన్ని పెంచేశారు. ఈ సాంగ్ చూసిన సాధారణ ప్రేక్షకుడు కూడా ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు చూసెయ్యాలా అనే కోరిక కలిగేలా ఈ సాంగ్ ఉంది.
స్వతహాగా సూపర్ డాన్సర్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎత్తర జెండా అంటూ వేసిన స్టెప్స్ కి ఫాన్స్ కి పూనకాలే. వారు వేసుకున్న డ్రెస్ లకి, వారి ఇచ్చిన ఫేస్ ఎక్సప్రెషన్స్ కి అన్నిటికి ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. అలాగే రాజమౌళి ఈ సాంగ్ లో ప్రత్యేకంగా దేశభక్తిని చూపించడం.. అమర వీరుల రూపాల ప్రదర్శనతో ఆ త్యాగధనులను స్మరించడం ప్రశంసనీయం. అలియా భట్ అందం, ఆమె స్టయిల్ అన్ని ఈ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఈ సాంగ్ చూసాక ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే అనుమానం ఎగిరిపోతుంది. అంతలా ఎన్టీఆర్ - రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాసారు. ఈ సాంగ్ చూసాక ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు స్టెప్స్ మరిచిపోయి అందరూ మన జెండాకి జేజేలు కొట్టడం ఖాయం. మళ్ళీ మళ్ళీ వినాలి కాదు చూడాలి అనిపించేలా ఈ ఆర్.ఆర్.ఆర్ సెలెబ్రేషన్స్ ఆంథెమ్ ఉంది.