రాజమౌళి బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా ఓ రికార్డ్ సెట్ చేసారు. బాహుబలి తో పాన్ ఇండియా మూవీస్ సత్తా చూపించారు. ప్రభాస్ ఇండియా స్టార్ గా మారిపోయారు. రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా అన్ని భాషల ప్రేక్షకులు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 తో సంచలనాలను సృష్టించిన రాజమౌళి - ప్రభాస్ లు బాహుబలి 3 కూడా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయమై గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుంది కానీ ఎప్పుడో చెప్పలేము అన్నారు. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.
బాహుబలి పార్ట్ 3 తప్పకుండా ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మూడో పార్ట్ కు సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని.. బాహుబలి 3 విషయంలో నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. కానీ బాహుబలి 3 సినిమా రావడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. అతి త్వరలోనే బాహుబలి సీక్వెల్ గురించి ఆసక్తికర వార్త రాబోతున్నట్టుగా కూడా చెప్పడంతో అటు ప్రభాస్ ఫాన్స్, ఇటు బాహుబలి ఫాన్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు.