Advertisementt

రామ్ చరణ్ ఫాన్స్ కూడా ఆగడం లేదుగా

Mon 14th Mar 2022 01:13 PM
ram charan,ram charan fans usa,rrr movie,charan fans,usa fans,rrr review  రామ్ చరణ్ ఫాన్స్ కూడా ఆగడం లేదుగా
Ram charan fans from USA రామ్ చరణ్ ఫాన్స్ కూడా ఆగడం లేదుగా
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఎటు చూసినా ఆర్.ఆర్.ఆర్ మాటే.. సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ, ఛానల్స్ లోను, ఆడియన్స్ నోటి వెంట అందరూ ఆర్.ఆర్.ఆర్ గురించిన మాటలే మాట్లాడుతున్నారు. రెండున్నరేళ్ల ఎదురు చూఫులకి మార్చి 25 తో శుభం కార్డు పడబోతోంది. తమ అభిమాన హీరోల సినిమా చూసేందుకు ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీం ఎన్టీఆర్ కోసం ఆయన ఫాన్స్ కార్లతో ర్యాలీ చెయ్యడమే కాదు.. ఆర్.ఆర్.ఆర్, టార్చ్ బేరర్ ఎన్టీఆర్ అంటూ కెనడా, యుఎస్ ఏ ఫాన్స్ చేసిన హంగామా, చేస్తున్న హడావిడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అక్కడ ఓవర్సీస్ ఫాన్స్ హంగామాలో ఎన్టీఆర్ చరణ్ ని డామినేట్ చేస్తున్నారు అన్నారు.

కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఓవర్సీస్ ఫాన్స్ కూడా చరణ్ అంటే చూపిస్తున్నారు. దట్టమైన మంచులో ఆర్.ఆర్.ఆర్, టీం రామ్ చరణ్, యుఎస్ ఏ ఫాన్స్, హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అంటూ చేస్తున్న హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమేనా.. మేము ఉన్నాం అంటూ చరణ్ ఫాన్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అందులోను రామ్ చరణ్ బర్త్ డే మంత్ కూడా కావడంతో.. అటు ఆర్.ఆర్.ఆర్ రాక, ఇటు బర్త్ డే కోసం ఫాన్స్ ఎంతెలా ఎదురు చూస్తున్నారో అనేది ఆ వీడియో లో చూపించారు. 

Ram charan fans from USA:

Ram charan fans from USA conveyed their best wishes to him & RRR Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ