బాహుబలి తో ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రభాస్.. సాహో తో యాక్షన్ చేసి హాలీవుడ్ రేంజ్ చూపించారు. రాధే శ్యామ్ తో లవ్ స్టోరీ నడిపించారు. సలార్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కె తో సూప్ మ్యాన్ అవతారం ఎత్తబోతున్నారు. ఆదిపురుష్ తో మోడ్రెన్ రాముడిగా కనిపించనున్నారు. స్పిరిట్ తో మాస్ యాంగిల్ చూపించనున్న ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో కామెడీ కేరెక్టర్ కి సిద్ధమయ్యారు. ప్రభాస్ - మారుతీ కాంబో కి రంగం సిద్ధమైంది. ఈ కాంబో పై అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ప్రభాస్ - మారుతీ మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ లా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్నారు. అందులో కోలీవుడ్ గ్లామర్ భామ మాళవిక మోహన్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్ గా పెళ్ళిసందడి భామ శ్రీలీల ని ఎంపిక చేస్తున్నట్లుగా టాక్.
మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ప్రభాస్ - మారుతీ మూవీ ఉండబోతుంది అని, ప్రభాస్ ఫాన్స్ మెచ్చేలా సినిమా ఉంటుంది అని, ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ అదిరిపోయే మసాలా కామెడీ ట్రాక్ సిద్ధం చేస్తున్నాడని, అఫీషియల్ గా ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. మరి ప్రభాస్ ని ఫుల్ లెంథ్ కామెడీ రోల్ లో చూసి చాలా రోజులైంది. మారుతీ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.. ఈ మూవీ అనౌన్సమెంట్ త్వరలోనే రాబోతుంది.. జస్ట్ వెయిట్ అండ్ సి.