ఇప్పుడు కొత్తగా జగన్ ఆధిపత్యం - పవన్ ఆత్మాభిమానం నినాదాన్ని ఎత్తుకున్నారు జనసైనికులు. మొన్నటివరకు అహంకారానికి - ఆత్మాభిమానానికి పోరు అంటూ భీమ్లా నాయక్ డైలాగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో జనసేన నినాదంలోకి షిఫ్ట్ అయ్యిపోయారు. రేపు అమరావతిలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. మొదటిసారి ఓ కమిటీ వేసి జనాన్ని కూడగడుతున్నారు. రేపు జరగబోయే సభకు గట్టిగా జనాలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చెదురు మదురు ఘటనలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా రేపు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు.? ఎలాంటి విమర్శలు చేస్తారు.? బిజెపికి ఎలా భజన చేస్తారు.? టిడిపితో పొత్తుపై ఎలా స్పందిస్తారు? యధావిధిగా జగన్ పై నిప్పులు ఎలా చెరుగుతారు? ఈ అంశాలపైనే పవన్ కళ్యాణ్ మీటింగ్ కేంద్రీకృతమై ఉంది.
రేపు నైట్ కల్లా పవన్ కళ్యాణ్ మీటింగ్ పై వాడి వేడి చర్చలు మళ్ళీ మొదలవుతాయి. మొన్నటివరకు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ రేపటి నుండి రాజకీయ ప్రకంపనలు లేపబోతున్నారు. ఇప్పటికే రాజకీయ వేదికలపై సినిమా ఇండస్ట్రీ విషయాలు, సినిమా వేదికలపై రాజకీయాలు మట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిబేట్ లకి అవకాశాల మీద అవకాశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులోను జగన్ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర చేసిన గందరగోళం పై పవన్ స్పందించే అవకాశం కూడా అంది. అందుకే రేపు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ఏం మాట్లాడతారో అనే దాని మీద ఏపీ ప్రజలు అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.