Advertisementt

యాంకర్ శివ కి గడ్డి పెట్టిన నాగ్

Sun 13th Mar 2022 07:24 PM
nagarjuna,anchor shiva,big boss,bigg boss ott,bigg boss ott telugu,big boss sunday episode  యాంకర్ శివ కి గడ్డి పెట్టిన నాగ్
Nagarjuna warning to anchor Shiva యాంకర్ శివ కి గడ్డి పెట్టిన నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో చాలెంజర్స్ vs వారియర్స్ మధ్యన టాస్క్ ల్లో పోటీనే కాదు.. మాటల తో యుద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటిటి మొదలై అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. ఆదివారం ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైపోయింది. నాగార్జున ఎంటర్ అవడమే.. హౌస్ మేట్స్ కి గట్టి క్లాస్ పీకే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ముందుగా యాంకర్ శివ కి గడ్డిపెట్టారు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఓ యూట్యూబ్ ఛానల్ కి యాంకర్ గా శివ అందరిని రకరకాల ప్రశ్నలతో ఆడుకునేవాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ లో నాగార్జున యాంకర్ శివ ని ఓ ఆట ఆడుకున్నారు.

సరయు కిచెన్ లో ఉండి.. నాకు పిండి తడిపి పెట్టావా శివ అని అడిగితే నాకు పిండి పిసకడం రాదు.. నీ పిండి పిసికేవాళ్ళని నేను పిలుస్తాను.. అఖిల్ వస్తాడంట నీ పిండి పిసకడానికి అంటూ చాలా వెటకారంగా మాట్లాడాడు. అక్కడే నటరాజ్ మాస్టర్ కూడా ఉన్నాడు. అయితే నామినేషన్స్ అప్పుడే సరయు శివ ని నువ్వు డబుల్ మీనింగ్ డైలాగ్ తో మాట్లాడావ్ అంటే.. నేను గనక డబుల్ మీనింగ్ లో మాట్లాడితే, అది తప్పయితే మీరెవరు నామినేట్ చెయ్యక్కర్లేదు నేనే బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్ళిపోతాను అన్నాడు. అదే విషయం నాగార్జున వీడియో క్లిప్స్ తో రుజువు చేసారు. హౌస్ మేట్స్ అంతా యాంకర్ శివనే తప్పుబట్టారు.

నాగార్జున సడన్ గా బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు.. శివ ఫేస్ మాడిపోయింది. దానితో శివ సారి చెప్పాడు. ఇక నాగార్జున తర్వాత తేజు, మిత్ర శర్మ, చైతు ఇలా కొంతమందిని చిన్నగా మందలించిన ఎపిసోడ్ ఇప్పుడు హాట్ స్టార్ లో ప్లే అవుతుంది. 

Nagarjuna warning to anchor Shiva:

Nagarjuna fores on anchor Shiva

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ