Advertisementt

ప్రభాస్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్

Sun 13th Mar 2022 06:03 PM
krishnam raju,prabhas,prabhas fans,saaaho,radhe shyam,pan india star  ప్రభాస్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్
Sweet news for Prabhas fans ప్రభాస్ ఫాన్స్ కి స్వీట్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలి టైం నుండి చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. రెండుమూడేళ్ళకి ఓ ఫిలిం తో ఫాన్స్ ముందుకు వస్తున్నారు ప్రభాస్, ఏడాదికి ఒక సినిమా చొప్పున రావాలంటూ ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నా అది జరగడం లేదు. బాహుబలి కి ఐదేళ్ల కాలాన్ని కరిగించిన ప్రభాస్ సాహో కి రెండున్నరేళ్లు, రాధే శ్యామ్ కి రెండేళ్ల సమయాన్ని తీసుకున్నారు. అయితే ఇకమీదట ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చొప్పున చేస్తూ ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు చెబుతున్నారు. రాధే శ్యామ్ లో ఓ గెస్ట్ రోల్ చేసిన కృష్ణ రాజు రీసెంట్ గా ఆపరేషన్ చేయించుకున్నారు.

ఈమధ్యనే రాధే శ్యామ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాధే శ్యామ్ సినిమాలో నేను పరమహంస గా చేశాను అని, ఆ పాత్రలో నన్ను చూసిన ప్రభాస్.. దేవుణ్ణి చూసినట్లుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని అన్నాడని, ప్రభాస్ విషయంలో ఆయన ఫాన్స్ ఒక్క విషయంలో డిస్పాయింట్ అవుతున్నారు అని, అది ప్రభాస్ రెండుమూడేళ్ళకి ఒక్క సినిమా చెయ్యడం నచ్చడం లేదు అభిమానులకి అంటూ చెప్పారు కృష్ణ రాజు. రాధే శ్యామ్ త్వరగా పూర్తయ్యేదే కానీ, కరోనా కారణంగా బాగా లేట్ అయ్యింది అని, ఇకపై ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడంటూ ఫాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పారు ఆయన. 

Sweet news for Prabhas fans:

Krishnam Raju About Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ