Advertisementt

టెన్షన్ పడుతున్న ప్రభాస్ ఫాన్స్

Sat 12th Mar 2022 10:38 PM
prabhas,prabhas fans,radhe shyam,prabhas looks,prabhas workouts  టెన్షన్ పడుతున్న ప్రభాస్ ఫాన్స్
Prabhas Fans in Tension టెన్షన్ పడుతున్న ప్రభాస్ ఫాన్స్
Advertisement
Ads by CJ

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ రాధే శ్యామ్ తో రీసెంట్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చారు. బాహుబలిలో ఆరడుగుల ఆజానుబాహుడిగా, అందమైన రారాజుగా ఆడియన్స్ ని, అమ్మాయిలని మెస్మరైజ్ చేసిన ప్రభాస్.. తర్వాత సాహో తో యాక్షన్ ఎంటర్టైనర్ చేసారు. ఆ సినిమాలోనే ప్రభాస్ లుక్స్ విషయంలో ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. అలాగే ఫిట్ నెస్ విషయంలోనూ ప్రభాస్ బాహుబలి దాటి ముందుకు వెళ్లలేకపోయారు. ఏదో ఇంటర్నేషనల్ ట్రైనర్ ని పెట్టికుని ప్రభాస్ జిమ్ చేస్తున్నారనే టాక్ కూడా నడిచింది. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి బరువు తగ్గించుకోలేకపోయారు.

రీసెంట్ గా విడుదలైన రాధే శ్యామ్ సినిమాలోనూ ప్రభాస్ చాలా స్లోగా, లుక్స్ పరంగాను, యాక్టింగ్ పరంగాను చాలా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డ దశలో బాధ్యత పెరగాలి కానీ బద్ధకం పెరక్కూడదు.. అంటూ ఫాన్స్ ప్రభాస్ కి సలహాలు ఇస్తున్నారంటే.. ప్రభాస్ తనని తాను ఖచ్చితంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. రేపు రాబోయే సినిమాల్లో ప్రభాస్ బరువు తగ్గాలి, ఇంకా లుక్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంది అనేది రాధే శ్యామ్ ఆయనకి చూపించింది. కానీ ఆదిపురుష్ షూటింగ్ ఫినిషయ్యింది, సలార్ కొద్దిగా షూటింగ్ చేసుకుంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా మొదలైపోయింది. దానితో ప్రభాస్ ఫాన్స్ ఆ సినిమాల్లో ప్రభాస్ ని ఎలా చూడాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. మరి ప్రభాస్ లుక్ విషయంలో శ్రద్ద తీసుకోకపోతే చాలా కష్టం అంటున్నారు ఫాన్స్.

Prabhas Fans in Tension:

Prabhas Is On Workouts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ