పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ భారీగా రిలీజ్ అయిన రాధే శ్యామ్ పాన్ ఇండియా ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది అనే చెప్పాలి. బాహుబలి రేంజ్ ఉన్న ప్రభాస్ సాహో తో యాక్షన్ ఫిలిం చేసి ఆడియన్స్ అంచనాల రీచ్ అయినా.. లవ్ స్టోరీ రాధే శ్యామ్ తో అంచనాలు అందుకోలేకపోయారు. ఎన్నోసార్లు వాయిదాలు వేసుకున్న రాధే శ్యామ్ విడుదలైన ప్రతి చోట ప్రభంజనం సృష్టిస్తుంది అనుకున్న మేకర్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి డే వన్ కలెక్షన్స్.
బాహుబలి తర్వాత వచ్చిన సాహో కమర్షియల్ సినిమా, మాస్ కంటెంట్ ఉన్న సినిమా అవడం వలన నార్త్ ఆడియన్స్ కి నచ్చేసింది. ఇక్కడ రాధే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ అవడం వలన డిశ్ అడ్వాంటేజ్ అయ్యింది. సాహోతో నార్త్ లో మొదటి రోజు 25 కోట్లు తెచ్చుకున్న ప్రభాస్.. రాధే శ్యామ్ తో కేవలం ఐదు కోట్లు తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందులో బాలీవుడ్ రివ్యూస్ కూడా బ్యాడ్ గా ఉండడం మైనస్ అయ్యింది. ఇక్కడ కొంతమందిని మ్యానేజ్ చెయ్యగలిగినా.. అక్కడ బాలీవుడ్ క్రిటిక్స్ ని మ్యానేజ్ చేయలేకపోయారు. అక్కడ మొత్తం నెగటివ్ రివ్యూస్ రావడం వలన, ఆ ఎఫెక్ట్ నార్త్ రెవిన్యూ పై బాగా కనిపించింది.. రాధే శ్యామ్ డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా వైజ్ కలెక్షన్స్
AP/TS - 37.85 cr
కర్ణాటక - 5.02 cr
తమిళనాడు - 1.37 cr
కేరళ - 0.31 cr
రెస్ట్ అఫ్ ఇండియా - 8.69 cr
ఓవర్సీస్ - 19.17 cr
టోటల్ వరల్డ్ వైడ్ రాధే శ్యామ్ డే 1 కలెక్షన్ - ₹ 72.41 కోట్లు