Advertisementt

విరాట పర్వం అప్ డేట్ ఇవ్వరా

Sat 12th Mar 2022 11:19 AM
rana,venu udugula,sai pallavi,virata parvam update,virata parvam movie  విరాట పర్వం అప్ డేట్ ఇవ్వరా
Would you like to update Virata Parvam? విరాట పర్వం అప్ డేట్ ఇవ్వరా
Advertisement
Ads by CJ

రానా - సాయి పల్లవి కాంబోలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం ప్రస్తుతం వార్తల్లో లేకుండా పోయింది. ఎప్పుడో గత ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన విరాట పర్వానికి ఇంతవరకు మోక్షం కలగడం లేదు. కరోనా తో ఆగిన సినిమాలు అన్ని వరసగా రిలీజ్ అవుతున్నాయి. ఆఖరికి కొత్తగా షూటింగ్ మొదలు పెట్టిన సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ఇస్తూ డేట్స్ లాక్ చేస్తున్నాయి. కానీ రానా విరాట పర్వం నుండి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. అసలు ఈ సినిమాకి డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది దగ్గుబాటి ఫాన్స్ కి అర్ధం కావడం లేదు.

విరాట పర్వం రిలీజ్ కి రెడీ అయ్యాక రానా ఒప్పుకున్న భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడం, ఫిబ్రవరిలో రిలీజ్ అవడం.. ఆ సినిమాలో రానా పెరఫార్మెన్స్ ని ఫుల్ మార్క్స్ పడడం జరిగింది. ఆ క్రేజ్ తో అయినా విరాట పర్వం బయటికి వస్తుంది అనుకుంటే అదీ లేదు. భీమ్లా ఇంటర్వ్యూ లో రానా విరాట పర్వం టాపిక్ ఎత్తినా రిలీజ్ డేట్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే విరాట పర్వానికి దర్శకుడు మళ్లీ రిపేర్లు చేస్తున్నాడు, అందుకే రిలీజ్ కి ఇంత టైం పట్టేస్తుంది అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి సురేష్ బాబు గారు విరాట పర్వం విషయమై ఏం ఆలోచిస్తున్నారో కానీ.. అటు ఫాన్స్ కూడా ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

Would you like to update Virata Parvam?:

Virata Parvam update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ