Advertisementt

ఓవర్సీస్ లో రికార్డు ఓపెనింగ్స్ తో రాధే శ్యామ్

Sat 12th Mar 2022 09:57 AM
prabhas,radhe shyam,pooja hegde,radhe shyam overseas openings  ఓవర్సీస్ లో రికార్డు ఓపెనింగ్స్ తో రాధే శ్యామ్
Radhe Shyam with record openings overseas ఓవర్సీస్ లో రికార్డు ఓపెనింగ్స్ తో రాధే శ్యామ్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన అత్యద్భుతమైన ప్రేమకథ రాధే శ్యామ్. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఓవర్సీస్ లో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది ఈ సినిమా ప్రీమియర్ తోనే 904 K డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. అందులోనూ ఇండియాలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. 

విజువల్ ఫీస్ట్ గా రాధే శ్యామ్ వచ్చింది. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. జస్టిన్ ప్రభాకరన్ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం ప్రూవ్ చేసుకున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మరోవైపు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఒకవైపు ప్రభాస్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు ఈయన. 

Radhe Shyam with record openings overseas:

Prabhas Radhe Shyam Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ