Advertisementt

బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..

Fri 11th Mar 2022 08:38 PM
bigg boss,bigg boss ott telugu,natarj master,mahesh vitta,sarayu,mitraw sharma  బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..
Bigg Boss OTT: Three are in Danger zone బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో మొదలై రెండు వారాలు పూర్తవుతుంది. బిగ్ బాస్ ఓటిటిలోకి వెళ్లిన 17 మందిలో మొదటి వారం అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లు, ఇంకా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో సభ్యులంతా తెగ కొట్టేసుకుంటున్నారు. వారియర్స్ - చాలెంజర్స్ అంటూ కొత్తవాళ్ళని - పాతవాళ్లని వేరు చెయ్యడం, రెండు గ్రూపుల వారు రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు యుద్దానికి కాలు దువ్వుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో మాటామాటా పెరిగి బిందు మాధవి vs నటరాజ్ ఫైట్ చేసుకోగా.. గత రాత్రి అనిల్ ని నటరాజ్ ఒరేయ్ అన్నాడంటూ అనిల్ నటరాజ్ తో గొడవ పడ్డాడు.

ఇక కెప్టెన్సీటాస్క్ లో చాలెంజర్స్ టీం గెలిచి అందులో అనిల్ కెప్టెన్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి. ఇక యాంకర్ శివ వారియర్స్ ని చీట్ చెయ్యడమేకాదు, ప్రతిసారి కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అదలా ఉంటే.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, అషు రెడ్డి, సరయు రాయ్, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని మీద ఆసక్తి  మొదలయ్యింది. ఓటింగ్ ప్రకారం అఖిల్ నెంబర్ వన్ లోను, యాంకర్ శివ సెకండ్ ప్లేస్ లోను, ఆరియానా, హమీదా, అషు, శ్రీ రాపాక, మిత్రా శర్మ, సరయులు వరస స్థానాల్లో ఉన్నారు. ఆతర్వాత అనిల్ తొమ్మిదో స్థానంలో, నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టాలు చివరి స్థానాల్లో అంటే డేంజర్ జోన్‌లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బిందు మాధవితో గొడవే నటరాజ్ ని ఇలా డేంజర్ లోకి నెట్టినట్లుగా, చివరి నిమిషంలో ఓట్స్ తారుమారు అయినట్లుగా తెలుస్తుంది. 

Bigg Boss OTT: Three are in Danger zone:

Bigg Boss OTT Telugu Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ