రామ్ చరణ్ ఈమధ్యనే చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసుకుని భార్య ఉపాసన, ఆమె చెల్లి ఫ్యామిలీతో ఫిన్ ల్యాండ్ లో ల్యాండ్ అయ్యారు. రామ్ చరణ్ అక్కడ మంచు కొండల్లో బాగా ఎంజాయ్ చేసారు. ప్రవేట్ జెట్ లో భార్య ఉపాసనతో వెకేషన్ ట్రిప్ వేసిన రామ్ చరణ్ అక్కడ దట్టమైన మంచు మధ్య ఛిల్ అవుతూ ఎంజాయ్ చేసారు. చిన్నపాటి వెకేషన్ ట్రిప్ ని ముగించేసి చరణ్ హైదరాబాద్ కి పయనమైన వీడియో ని షేర్ చేసారు. రామ్ చరణ్ మంచు వదిలించుకుంటూ ప్రవేట్ జెట్ ఎక్కిన వీడియో అది. రామ్ చరణ్ వెకేషన్స్ నుండి హైదరాబాద్ కి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తుంది.
ఎందుకంటే మరో మూడు రోజుల్లో ఆయన నటించిన పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. రాజమౌళి మార్చి 14 నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఆర్.ఆర్.ఆర్ సెలెబ్రేషన్స్ ఆంతమ్ తో మొదలు పెట్టబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. అసలైతే ఈ సాంగ్ సినిమా రిలీజ్ అయ్యే ముందువరకు రిలీజ్ చెయ్యొద్దు అనుకున్నా.. డిసెంబర్ లోనే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ పూర్తవడంతో.. మళ్ళీ కొత్తగా చేసే ఉద్దేశ్యంతోనే ఆ సాంగ్ రివీల్ చేస్తున్నట్టుగా రాజమౌళి చెప్పారు. ఇక రామ్ చరణ్ మరో మూడు రోజుల్లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తో జత కట్టబోతున్నాడు.