Advertisementt

ఎన్టీఆర్ పై రాజమౌళికి స్పెషల్ ఇంట్రెస్ట్

Fri 11th Mar 2022 03:36 PM
rajamouli,prabhas,radhe shyam special interview,ntr,tarak,tarak - rajamouli,ram charan,rrr movie  ఎన్టీఆర్ పై రాజమౌళికి స్పెషల్ ఇంట్రెస్ట్
Rajamouli has a special interest in NTR ఎన్టీఆర్ పై రాజమౌళికి స్పెషల్ ఇంట్రెస్ట్
Advertisement
Ads by CJ

ఏ హీరో తో చేయనన్ని మూవీస్ రాజమౌళి ఎన్టీఆర్ తో చేసారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమ దొంగ, రీసెంట్ గా చేసిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ ఎప్పుడు లోన్లీ గా, ప్లాప్ స్టేజ్ లో ఉన్నా రాజమౌళి ఇచ్చిన సపోర్ట్ తోనే నిలబడ్డాను అంటూ చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా రాధే శ్యామ్ ప్రభాస్ తో ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి ఇంటర్వ్యూ జరిగింది. ప్రభాస్ ని రాజమౌళి స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి రాధే శ్యామ్ విషయాలను గురించి ప్రభాస్ ని ప్రశ్నించారు. దానికి రాధే శ్యామ్ బాగా వచ్చింది అని,  పూజా హెగ్డే తో కెమిస్ట్రీ కుదిరింది అని, రాధే శ్యామ్ క్లైమాక్స్ సూపర్ అని చెప్పారు.

అయితే ప్రభాస్ రాజమౌళిని ప్రశ్నిస్తూ ఆర్.ఆర్.ఆర్ కి తనని ఎందుకు తీసుకోలేదంటూ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీం గా చాలా అద్భుతంగా ఉన్నారని, ఆర్.ఆర్.ఆర్ లో వాళ్లతో పాటుగా నేను కూడా ఉంటె బావుండేది అని, నన్నెందుకు తీసుకోలేదు అంటూ ప్రభాస్ రాజమౌళిని సూటిగా ప్రశ్నించారు. దానికి రాజమౌళి నువ్వు ఒక పెద్ద షిప్ లాంటివి వాడివి.. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కథకు అవసరం అయ్యే పాత్రలో ఉన్నారు. కానీ కథకు ఆవసరం లేనప్పుడు పెద్ద షిప్ ను అనవసరంగా అందులో ఇరికించడం ఏ మంత్రం బాగుండదు అని.. ఒకవేళ అవసరం అనుకుంటే నేను నిన్ను ఒప్పించగలను అని తెలివిగా సమాధానం చెప్పారు.

అయినా ప్రభాస్ రాజమౌళిని వదల్లేదు.. ఏదైనా మీకు చరణ్, ఎన్టీఆర్ అంటేనే ఇష్టం.. అందులోనూ ఎన్టీఆర్ అంటే మరీ ఇష్టం.. ఎందుకంటే చాలాసార్లు నాతోనే మీరు ఎన్టీఆర్ కోసం కొన్ని కథల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నట్లుగా చెప్పేవారు అని అడగగా.. దానికి రాజమౌళి కూడా తెలివిగా.. ప్రస్తుతం నేను ఏ సినిమా చేస్తున్నా.. అందులో హీరోనే నాకు ముఖ్యం మరెవరూ కాదు అంటూ ప్రభాస్ కి పర్ఫెక్ట్ సంధానం ఇచ్చారు. 

Rajamouli has a special interest in NTR:

Rajamouli - Prabhas Special interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ