Advertisementt

రెండువారాలైనా గట్టెక్కని భీమ్లా

Fri 11th Mar 2022 01:40 PM
bheemla nayak,pawan kalyan,bheemla nayak 2 weeks collections,bheemla nayak 2 weeks world wide collections,bheemla nayak final run,pawan kalyan bheemla nayak  రెండువారాలైనా గట్టెక్కని భీమ్లా
Bheemla Nayak 2 weeks collections రెండువారాలైనా గట్టెక్కని భీమ్లా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి నేటికీ రెండు వారాలు పూర్తయ్యింది. భీమ్లా నాయక రిలీజ్ అయిన ఫస్ట్ షో కె సూపర్ హిట్ టాక్ పడిపోయింది. ఫాన్స్ కూడా భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ ని విపరీతంగా స్ప్రెడ్ చేసారు. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులు భీమ్లా నాయక్ నే ట్రెండ్ చేసారు. అంత హిట్ టాక్, అంత హైప్ ఉన్న మూవీ కి సెలబ్రిటీస్ నుండి స్పెషల్ విషెస్ అందాయి. అలాంటి సినిమాకి రెండు వారాలైనా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా కిందా మీదా పడుతుంది. తెలంగాణాలో ఐదు ఆటలు, టికెట్ రేట్స్ పెంపు ఉన్నా.. ఇక్కడా భీమ్లా నాయక్ కి లక్షల్లో లాస్ వచ్చేలా కనిపిస్తుంటే.. ఏపీలో బయ్యర్లు భారీ నష్టాలూ మూటగట్టుకునేలా కనిపిస్తుంది భీమ్లా నాయక్ వ్యవహారం. 

ఏపీలో టికెట్ రేట్స్ తక్కువ ఉండడం, ఐదో షో లేకపోవడం భీమ్లా నాయక్ కి భారీ బ్యాండ్ పడింది.  ఇక ఈ వారం పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ హడావిడి మొదలైంది.. దానితో భీమ్లా నాయక్ థియేటర్స్ అన్నీ రాధే శ్యామ్ కి వెళ్లిపోయాయి. ఇక రెండు వారాలతో భీమ్లా నాయక్ ఫైనల్ రన్ ఓవరాల్ గా ముగిసినట్టే. భీమ్లా నాయక్ రెండు వారాల కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా        కలెక్షన్స్(కోట్లలో)

నైజాం            - 34.62

సీడెడ్             - 11.00

ఉత్తరాంధ్ర       -   7.53

ఈస్ట్ గోదావరి    -  5.44

వెస్ట్ గోదావరి     -  4.95

గుంటూరు         -  5.19

కృష్ణా                - 3.76 

నెల్లూరు            - 2.53

ఏపీ, తెలంగాణ డే 14 డేస్ కలెక్షన్స్ - 75.02 కోట్లు

ఇతర ప్రాంతాలు  -  8.21

ఓవర్సీస్               - 12.47   

వరల్డ్ వైడ్ 14 డేస్ కలెక్షన్స్ - 95.70 కోట్లు

Bheemla Nayak 2 weeks collections:

Bheemla Nayak 2 weeks world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ