Advertisementt

దుబాయ్ లో నాగ్, మరి బిగ్ బాస్

Thu 10th Mar 2022 08:00 PM
nagarjuna,the ghost,ghost update,bigg boss,bigg boss ott telugu update  దుబాయ్ లో నాగ్, మరి బిగ్ బాస్
The Ghost in action in Dubai దుబాయ్ లో నాగ్, మరి బిగ్ బాస్
Advertisement
Ads by CJ

బంగార్రాజు హిట్ జోష్ లో అక్కినేని నాగార్జున తన తదుపరి మూవీ ది ఘోస్ట్ షూటింగ్ లో పాల్గొనడమే కాదు, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి హోస్ట్ గాను చేస్తున్నారు. ఈసారి శనివారం, ఆదివారం అంటూ రెండు రోజులు కాకుండా కేవలం ఆదివారం మాత్రమే నాగార్జున మూడు గంటల పాటు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ది ఘోస్ట్ షూటింగ్ కోసం నాగార్జున, ఘోస్ట్ యూనిట్ దుబాయ్ పయనమయ్యారు. అక్కడ దుబాయ్ లో ఘోస్ట్ కొత్త షెడ్యూల్ తిరిగి ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్ అని తెలుస్తుంది. 

ఈ షెడ్యూల్ లో హీరోయిన్ సోనాల్ చౌహన్ తో డ్యూయెట్స్ వేసుకోనున్నారటనాగార్జున. ఇక ఈ సాంగ్ చిత్రీకరణ అలాగే సినిమాలోని కీలకపాత్రలు పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించనున్నారు మేకర్స్. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందంగా ఉంది అంటుంది. సోనాల్ చేస్తున్న పాత్రలో ముందుగా కాజల్ నటించగా.. ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి సోనాల్ వచ్చింది. 

అయితే ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న నాగార్జున వచ్చే ఆదివారం జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ ని ఎలా పూర్తి చేస్తారు. ఆయన ప్లేస్ లోకి మరో యాంకర్ ఎవరైనా వస్తారా.. లేదంటే దుబాయ్ నుండి నాగ్ స్పెషల్ ఫ్లైట్ లో వస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.  

The Ghost in action in Dubai:

Bigg Boss OTT Telugu Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ