Advertisementt

సర్కారు వారు మాసీవ్ వన్ లోడింగ్

Thu 10th Mar 2022 01:22 PM
sarkaru vaari paata,mahesh babu,keerthy suresh,s.s.thaman,parasuram,anantha sriram  సర్కారు వారు మాసీవ్ వన్ లోడింగ్
Thaman increases expectations on SVP second single సర్కారు వారు మాసీవ్ వన్ లోడింగ్
Advertisement
Ads by CJ

ఈమద్యనే కళావతి సాంగ్ తో రికార్డులు సృష్టించిన సర్కారు వారి పాట టీం.. ఇప్పుడు మరో సెన్సేషన్ కి రెడీ అయ్యింది. మహేష్ బాబు - కీర్తి సురేష్ కాంబోలో కలావతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎవరు చూసినా కళావతి సాంగ్ స్టెప్స్ వేస్తూ కనిపిస్తున్నారు. మహేష్ డాటర్ సితార దగ్గర నుండి.. సెలబ్రిటీస్, మహేష్ ఫాన్స్, డాన్స్ లవర్స్ అంతా కళావతికి కాలు కదుపుతున్నారు. ఆ సాంగ్ ఇంకా ఇంకా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూనే ఉంది. ఇప్పుడు మరో సాంగ్ రెడీ చేస్తున్నట్టుగా పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, లిరికిస్ట్ అనంత శ్రీరామ్ కలిసి మరో అప్ డేట్ ఇచ్చారు. 

సర్కారు వారి పాట నుండి మాసీవ్ వన్ లోడింగ్.. అంటూ ఆ ముగ్గురు ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు,. మరి మాంచి ఫామ్ లో ఉన్న థమన్ నుండి సాంగ్ వస్తుంది అంటే ఆయా హీరోల ఫాన్స్ ఊగిపోతున్నారు. అలా వైకుంఠపురములో, భీమ్లా నాయక్, అఖండ మూవీ మ్యూజిక్ జాతర ముగియకముందే సర్కారు వారి పాట తో థమన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరి సర్కారు వారి పాట నుండి రాబోతున్న ఈ మాసీవ్ వన్ లోడింగ్ ఏ రేంజ్ రికార్డులని సృష్టిస్తుందో చూద్దాం. 

Thaman increases expectations on SVP second single:

Sarkaru Vaari Paata Crazy update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ