Advertisementt

రామ్ చరణ్ ని డామినేట్ చేస్తున్న ఎన్టీఆర్

Thu 10th Mar 2022 11:18 AM
ntr fans,tarak,ram charan,ntr rrr,rrr movie,rrr movie review,charan fans  రామ్ చరణ్ ని డామినేట్ చేస్తున్న ఎన్టీఆర్
NTR dominating Ram Charan రామ్ చరణ్ ని డామినేట్ చేస్తున్న ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చూసి సినిమాపై తెగ ఇంట్రెస్ట్ ని పెంచుకుంటే.. కరోనా మోసం చేసింది. అయినా ఏ మాత్రం అంచనాలు, ఆసక్తి ఆర్.ఆర్.ఆర్ మీద తగ్గలేదు. మార్చ్ 25న రాబోయే ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ vs రామ్ చరణ్ ఫాన్స్ అన్నట్టుగా ఉంది వ్యవహారం, ఎన్టీఆర్ ఫాన్స్ ఓవర్సీస్ లో థియేటర్స్ లో టికెట్స్ అన్ని కొనేసి వార్తల్లో నిలుస్తున్నారు. కొమరం భీం గా ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఎన్టీఆర్ ఓవర్సీస్ ఫాన్స్ అక్కడ రచ్చ చేస్తున్నారు. అక్కడి థియేటర్స్ లో ఉన్న సీట్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ హోల్సేల్ గా కొనేస్తున్నారు. 

ఎక్కడ చూసినా ఎన్టీఆర్ నామ జపమే అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ లో రామ్ చరణ్ ఫాన్స్ రచ్చ చేసారు. గతంలో జరిగిన బెంగుళూరు ప్రెస్ మీట్, చెన్నై ప్రెస్ మీట్ దగ్గర రామ్ చరణ్ ఫాన్స్ నానా హంగామా చేసారు. చరణ్ పీఆర్వో లు కూడా ఆయనకి మంచి పబ్లిసిటీ ఇవ్వగా.. ఇప్పుడు ఓవర్సీస్ లో ఎన్టీఆర్ ఫాన్స్ చేసే హంగామా ముందు చరణ్ తేలిపోతున్నాడు. అక్కడ ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఓవర్సీస్ మొత్తం చరణ్ మీద ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఎన్టీఆర్ ఫాన్స్ ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

NTR dominating Ram Charan:

NTR Fans Buy Entire Theatre For RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ