Advertisementt

పబ్లిసిటీ కోసమే ఈ ప్లాన్

Wed 09th Mar 2022 08:36 PM
jabardasth naresh,accident,cash programme,suma kanakala,naresh  పబ్లిసిటీ కోసమే ఈ ప్లాన్
Jabardasth Naresh met with an accident పబ్లిసిటీ కోసమే ఈ ప్లాన్
Advertisement
Ads by CJ

ఈమధ్యన ఈటివి కి స్టార్ మా గట్టి పోటీ ఇస్తుంది. అది సీరియల్స్ లో కాదు.. కామెడీ విషయంలో. జబర్దస్త్ కామెడీ షో కి చెక్ పెడుతూ స్టార్ మా వాళ్ళు కామెడీ స్టార్స్ పేరుతొ రచ్చ రచ్చ చేస్తున్నారు. జబర్దస్త్ లోని చాలామంది కామెడీ చేసే కమెడియన్స్ కామెడీ స్టార్స్ కోసం స్టార్ మాకి వెళ్లిపోయారు. అయినా జబర్దస్త్ లో ఏమాత్రం తగ్గకుండా కామెడీ స్కిట్స్ చేస్తున్నారు ఇక్కడ. అయినా ఇంకా క్రేజ్ కోసం అప్పుడప్పుడు కొన్ని ప్రాంక్ ప్రోమోస్ తో హడావిడి చేస్తుంటారు. లేటెస్ట్ గా సుమ క్యాష్ లో అలానే ఓ ప్రాంక్ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. ఈ మధ్యన సుమ క్యాష్ షో హద్దులు దాటి, డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ కూడా వినిపిస్తున్నాయనే కంప్లైంట్ ఉంది.

వచ్చే శనివారం రాబోయే ఎపిసోడ్ లో జబర్దస్త్ నరేష్ సుమ కి ఐ లవ్ యు చెప్పగా.. వరే మా ఆయన చూసాడంటే నిన్ను ఇక్కడే పాతేస్తాడు అంటూ సుమ కూడా కామెడీ చేసింది. ఇక షో చివరిలో నరేష్ సుమ తో మీరు లవ్ చేయ‌క‌పోతే ఇక్కడి నుండి దూకేస్తాను అంటూ బెదిరించాడు. సుమ కూడా ఏదో జోక్ చేస్తున్నాడని లైట్ తీసుకుంది అలా నరేష్ రాడ్స్ పట్టుకోగా.. అనుకోకుండా ఆ రాడ్స్ జారీ నరేష్ ని కిందపడి నట్టుగా చూపించడమే కాదు, ఆ తర్వాత రోడ్ మీద అంబులెన్స్ వెళుతున్న సౌండ్స్ ని ఆ ప్రోమోలో చూపించారు. మరి నిజంగా నరేష్ కి అక్కడేదో ప్రమాదం జరిగినట్టుగా క్రియేట్ చేసి క్యాష్ మీద క్రేజ్ పెంచి పబ్లిసిటీ పెంచుకోవాలనే ప్లాన్ తో బుల్లితెర ప్రేక్షకులని వెర్రివాళ్ళని చేసున్నారు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. 

Jabardasth Naresh met with an accident:

Jabardasth Naresh met with an accident in cash programme

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ