Advertisementt

అప్ డేట్ వచ్చినా క్రేజ్ లేదే..

Wed 09th Mar 2022 01:12 PM
kgf 2,prashanth neel,yash,kgf chapter 2,kgf update  అప్ డేట్ వచ్చినా క్రేజ్ లేదే..
There is no craze when the update comes .. అప్ డేట్ వచ్చినా క్రేజ్ లేదే..
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా మూవీస్ అంటే విడుదలయ్యే అన్ని భాషల్లో ఆడియన్స్ లో క్రేజ్ ఉండాలి. అందులో పార్ట్ వన్ వచ్చి సక్సెస్ అయినప్పుడు పార్ట్ 2 పై విపరీతమైన క్రేజ్ ఉండాలి. బాహుబలిని చూడండి.. రాజమౌళి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ ఆడియన్స్ దగ్గర నుండి పీఎం మోడీ వరకు అందరిలో ఆసక్తిని క్రిటెట్ చేసారు. మరి ఇప్పుడు కెజిఎఫ్ పార్ట్ వన్ హిట్ అవడంతో మేకర్స్ పార్ట్ 2 ని భారీ బడ్జెట్ తో ఏప్రిల్ 14 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అసలు రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఉన్న క్రేజ్ కెజిఎఫ్ కి ఉందా? అనేది ఇప్పుడు అందరిలో మొదలు అవుతున్న ప్రశ్న. ఎందుకంటే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారు చేసిన కాంబినేషన్ లో చాప్టర్ 2 రాబోతుంది అంటే సోషల్ మీడియాలో ఏ రేంజ్ హడావిడి ఉండాలి.

కానీ కెజిఎఫ్ 2 విషయంలో అలాంటిది ఏం కనిపించడం లేదు. ట్రైలర్ ని మార్చి 27 న రిలీజ్ చేస్తున్నట్టుగా టీం ప్రకటించింది అది ఓకె. కాని ఉమెన్స్ డే రోజున కెజిఎఫ్ నుండి మహిళలకి సలాం చేస్తూ కెజిఎఫ్ లో నటించిన మహిళలని ఆ పోస్టర్ లో డిజైన్ చేసి మరీ వదిలారు. కానీ ఆ పోస్టర్ ఎప్పుడు వచ్చిందో. ఎప్పుడు వెళ్లిందో ఎవ్వరికి తెలియదు. పాన్ ఇండియా మూవీస్ ఏ అప్ డేట్ అయినా క్షణంలో వైరల్ అవుతున్న ఈ సమయంలో కెజిఎఫ్ అప్ డేట్ మాత్రం వైరల్ అవ్వలేదు. దానితో అప్ డేట్ వచ్చినా క్రేజ్ లేదుగా అంటున్నారు. మరి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యాలంటే.. ఇలా అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తే సరిపోదు.. వరసబెట్టి ప్రమోషన్స్ లోకి దిగితే ఫలితం ఉంటుంది.

There is no craze when the update comes ..:

KGF 2 Womens Day Special poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ