చాలా ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతూ తనకంటూ ఓ ప్రత్యేక స్తానం నిలుపుకున్న మెగా స్టార్ చిరంజీవి అంటే మన పరిశ్రమలోనే కాదు ఇతర చిత్ర పరిశ్రమల్లో కూడా చాలా గౌరవంగా చూస్తారు. ముఖ్యంగా చిరంజీవి, దాసరి మరణం తరువాత ఇండస్ట్రీ లో ఉన్న సమస్యలని తన భుజం పై వేసుకుని నేనున్నాను మీకు అంటూ తన చిరు నవ్వుతో ముందికి కదిలారు. అలానే ఏపీ టికెట్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చాలా మంది ప్రముఖలతో మీటింగ్స్ పెట్టి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి అని చాలా మదన పడి, చివరికి పేర్ని నాని తో సీఎం జగన్ వద్దకు టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు, అగ్ర ప్రొడ్యూసర్స్ తో వెళ్లి టికెట్స్ విషయం గురించి తమ ఆవేదను వెల్లడించారు.
ఆ సమయంలో జగన్ తన ఇగో ని చూపిస్తూ చిత్ర పరిశ్రమ ఏపీ వచ్చేయాలని డైరెక్ట్ గా చెప్పడం, ఏపీలో 20 శాతం షూటింగ్ చేయాలని, వంద కోట్లు పైన ఉన్న సినిమాలకే రేట్స్ పెంచుతాం అని డైరెక్ట్ గా చెప్పడంతో దానికి చిరు మోహమాటంతో సరే మేము అన్ని చేస్తాం అని చెప్పారు. తరువాత చిరు తన స్థాయిని మరచి జగన్ కి రెండు చేతులు జోడించి మీరే మా చిత్ర పరిశ్రమను కాపాడాలని అడగటం, బయటకు వచ్చి మళ్లీ ప్రెస్ మీట్ లో జగన్ కు అయిష్టంగానే ధన్యవాదాలు చెప్పడం జరిగింది. చిరంజీవి తన స్థాయిని పక్కన పెట్టి ఇందంతా చేసింది చిత్ర పరిశ్రమ కోసమే. ఏదో టికెట్స్ రేట్స్ మనకు అనుకూలంగా వస్తే పరిశ్రమ బాగుంటదని ఆశపడ్డారు. కానీ చిరంజీవి ఆశించినంతగా రేట్స్ రాలేదు. అది కూడా తన తమ్ముడు సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన రెండు వారాలకి జీవో రావడంతో ఒక్కసారిగా చిరు నిరాశపడ్డారు. మరి ఈ ఇష్యూ ఎప్పటికి సెటిల్ అవుతుందో, చిరులో ఆ చిరునవ్వు మళ్లీ ఎప్పుడు చూస్తామో.