Advertisementt

రాధే శ్యామ్ కి అక్కడ కష్టమే

Wed 09th Mar 2022 09:51 AM
prabhas,radhe shyam,bollywood,north audience  రాధే శ్యామ్ కి అక్కడ కష్టమే
Will Radhe Shyam be popular with the North audience? రాధే శ్యామ్ కి అక్కడ కష్టమే
Advertisement
Ads by CJ

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ రేపు శుక్రవారమే విడుదలకి రెడీ అయ్యింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్ ఫాన్స్ కి రాధే శ్యామ్ ట్రీట్ ఇవ్వబోతుంది. అయితే రాధే శ్యామ్ కి అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ నార్త్ ప్రేక్షకుల్లో రాధే శ్యామ్ పై అంత ఇంట్రెస్ట్ కనిపించడం లేదనేది బాలీవుడ్ మీడియా టాక్. ప్రభాస్ చిత్రాలంటే బాలీవుడ్ లో ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే బాహుబలి అలాంటి బెంచ్ మార్క్ సెట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ని నార్త్ ప్రేక్షకులు ఏ రకంగా ఆదరించారో సాహో నే పెద్ద ఉదాహరణ. సాహో అన్ని భాషల్లో ప్లాప్ అయినా.. నార్త్ లో మాత్రం నిర్మాతలకు లాభాలు తీసుకువచ్చింది. అంటే బాహుబలి, సాహో లు యాక్షన్ మూవీస్ కాబట్టి. తెలుగు యాక్షన్ మూవీస్ కి బాలీవుడ్ సినీ లవర్స్ బ్రహ్మరధం పడతారు. 

అయితే ఇక్కడ రాధే శ్యామ్ లో యాక్షన్ లేదు.. కేవలం ప్రేమ, విధి కి మధ్యన జరిగే యుద్ధం. ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ప్రభాస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అలా అయితే రాధే శ్యామ్ కి నార్త్ ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న. అందుకే రాధే శ్యామ్ ప్రమోషన్స్ ముంబై లో జరిగినా.. ఇక్కడి వారు ఇంట్రెస్ట్ గా ఆ ప్రెస్ మీట్స్ గురించిన మాట్లాడుకున్నా నార్త్ ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కనిపించలేదు. మరి బాహుబలి మ్యాజిక్ మరోసారి రాధే శ్యామ్ పై పని చేస్తుందేమో చూద్దాం. 

Will Radhe Shyam be popular with the North audience?:

Prabhas Radhe Shyam to release in theatres on 11 March

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ