ఏపీలో టికెట్ రేట్స్ పెంపు జీవో ఏపీ సీఎం జగన్ గారి సంతకం పడిందో లేదో.. టాలీవుడ్ ప్రముఖులు ఆయనకి థాంక్స్ చెబుతూ ట్వీట్స్ చేసారు. ప్రభాస్ అయితే రాధే శ్యామ్ రిలీజ్ కి ముందు ఈ జీవో రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ జగన్ కి మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు. 100 కోట్ల బడ్జెట్ దాటినా సినిమాలకే మొదటి 10 రోజులు టికెట్ రేట్స్ హైక్ వర్తిస్తుంది. అలాగే హీరోలు రెమ్యునరేషన్ పరిగణనలోకి తీసుకోకుండా 100 కోట్ల బడ్జెట్ పెట్టిన వారికే వర్తిస్తుంది. ఏపీలో 20 శాతం షూటింగ్ చేసిన సినిమాలకి మాత్రమే మొదటి పది రోజులు టికెట్ రేట్స్ పెంపు ఉంటుంది అంటూ మెలిక పెట్టారు.
మరి రాధే శ్యామ్ కానీ మరో పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ మూవీ కానీ తమ షూటింగ్స్ ని ఎక్కడా ఏపీలో చెయ్యలేదు. 20 శాతం కాదు ఒక్క శాతం షూటింగ్ కూడా చెయ్యలేదు. దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అసలు ఆంధ్రలో షూటింగ్ కి అనుకూలమైన ప్రాంతాలు 20 శాతం షూట్ చేసేందుకు ఉన్నాయా అని. అదలా ఉంటే.. ఇప్పుడు ఆంధ్రలో షూటింగ్ జరుపుకోని ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ పెద్ద సినిమాలు కాబట్టి అవి 20 శాతం షూటింగ్ ఏపీలో జరుపుకోకపోయినా... వాటికి ఈ రూల్ ను మినహాయిస్తూ కొత్త టికెట్ రేట్స్ హైక్స్, 5 షోల పర్మిషన్ ఉంది. కానీ ఇక పై రాబోయే సినిమాలకి 20% ఆంధ్రాలో కచ్చితంగా షూటింగ్ చేస్తేనే వాటికీ టికెట్ రేట్స్ హైక్ ఉంటుంది అని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.