RC 15 షూటింగ్ కి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి మధ్యన మెగా హీరో రామ్ చరణ్ తన భార్య తో కలిసి చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఉపాసన తో కలిసి రామ్ చరణ్ ఫ్లైట్ ఎక్కారు. ఆ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో తెలుపుతూ.. రెండేళ్ల తర్వాత ఇలా.. వెకేషన్స్ కి వెళుతున్నామని, థాంక్యూ మిస్టర్ సి అంటూ భర్తకి థాంక్స్ చెప్పింది. అయితే రామ్ చరణ్ - ఉపాసన కలిసి ఫిన్లాండ్ కి రొమాంటిక్ వెకేషన్స్ కి చెక్కేశారు. అక్కడ ఫిన్లాండ్ లో దట్టమైన మంచు మధ్యన స్వేట్టర్స్ గట్రా వేసుకుని చరణ్ తన భార్య ఉపాసన తో ఎంజాయ్ చేస్తున్న పిక్ ని షేర్ చేసారు.
చుట్టూ మంచు తో కప్పబడిన చెట్లు, ఇంకా వెనుకవైపు చూడదగిన ప్రదేశాలతో చరణ్ వాళ్ళు ఉన్న ప్లేస్ చాలా అందంగా కూల్ గా కనిపిస్తుంది. రామ్ చరణ్ ఈ చిన్నపాటి వెకేషన్ ముగిసిన వెంటనే రాజమౌళి అండ్ ఎన్టీఆర్ తో ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన రెండు రోజులకే రామ్ చరణ్ బర్త్ డే రాబోతుంది. రామ్ చరణ్ బర్త్ డే కి రాబోయే అప్ డేట్స్ పై మెగా ఫాన్స్ ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నారు. ఆయన బర్త్ డే మంత్ అంటూ సోషల్ మీడియాలోనూ హంగామా చేస్తున్నారు.