Advertisementt

సలార్ లో సముద్రం ఫైట్

Tue 08th Mar 2022 02:13 PM
salaar: prabhas,prashanth neel,radhe shyam,kegf 2,sruthi hasan,sraddah kapoor  సలార్ లో సముద్రం ఫైట్
Prabhas underwater sensation in Salaar సలార్ లో సముద్రం ఫైట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా ఫిలిం సలార్ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ చివరి వారంలో మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈలోపు ప్రభాస్ రాధే శ్యామ్ విడుదలవుతుంది. అలాగే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కె ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంటారు. ప్రశాంత్ నీల్ కూడా తన కెజిఎఫ్ చాప్టర్ విడుదల సన్నాహాలు, ప్రమోషన్స్, సినిమా రిలీజ్ ముగించేసుకుని ఫ్రీ అవుతారు. ఇప్పటికే సలార్ రెండు భారీ యాక్షన్ షెడ్యూల్స్ పూర్తి చేసింది టీం. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలే మెయిన్ హైలెట్ అని, అందుకే ఆలోచించకుండా భారీ గా ఖర్చు పెడుతున్నారట మేకర్స్.

అయితే సలార్ మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వచ్చే ఫైట్ విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియా లో హైలెట్ అయ్యింది. ఆ సన్నివేశం సముద్రంపై జరిగే ఛేజింగ్ .. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. అలాగే సలార్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. సలార్ లో ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అలాగే హీరోయిన్ శృతి హాసన్ కి ఓ ఫైట్ సీన్ ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్ తో సాహో లో నటించిన శ్రద్ద కపూర్ ని ఎంపిక చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. 

Prabhas underwater sensation in Salaar:

Salaar: Prabhas sensation in the ocean

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ