చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించి అందరితో అభినందనలు అందుకుంటున్న మహేష్ బాబు.. సందర్భోచితంగా వేసే ట్వీట్స్ తో శభాష్ అనిపించుకుంటున్నారు ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినా.. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాల మీద ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ట్వీట్స్ వేస్తుంటారు మహేష్. టీం మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తూ, అప్రిషెట్ చేస్తూ ట్వీట్స్ వెయ్యడం మహేష్ కి అలవాటు. ఇక ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడైతే చాలా మీనింగ్ ఫుల్ ట్వీట్స్ తో తనదైన స్టయిల్లో ట్వీట్స్ చేస్తుంటారు. ఈ రోజు మహిళాదినోత్సవం సందర్భంగా తన తల్లిని, భార్యని, కూతురుని మెన్షన్ చేస్తూ వాళ్ళ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన లైఫ్ లో వాళ్ళెంత కీ రోల్ ప్లే చేసారో అనేది తెలియజేస్తూ ఇలాంటి ట్వీట్స్ చెయ్యడం చాలామందిని ఇంప్రెస్స్ చేసింది.
ముఖ్యంగా మహేష్ కున్న ఫీమేల్ ఫాలోయింగ్ తెలిసిందే కదా.. అమ్మాయిలందరూ మహేష్ ట్వీట్ కి ఎగబడి లైక్స్ కొడుతున్నారు. మహేష్ బాబు తన తల్లి ఇందిరా గారిని ఎంత అపురూపంగా చూసుకుంటారో.. భార్య నమ్రత, కూతురు సితారని అంతే ప్రేమిస్తారు. తన లైఫ్ లో నమ్రత పాత్ర ఎంత ఉంటుందో చెప్పకనే చెప్పే మహేష్.. కూతురు సితార తో స్పెండ్ చేసే ప్రతి విషయాన్ని నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంటారు. ప్రస్తుతం మహేష్ చేసిన ఉమెన్స్ డే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.