ఎప్పుడు ఎలాంటి టాలీవుడ్ మీటింగ్స్ కి హాజరు కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మెగాస్టార్ చిరు - రాజమౌళి, మహేష్ తో కలిసి ఏపీ సీఎం జగన్ ని మీటవడం అందరికి షాకింగ్ గా అనిపించింది. మెగాస్టార్ బృందంతో జగన్ ని మీటయ్యి మీడియా పాయింట్ దగ్గర మొహమాటంగానే.. ఏపీ సీఎం జగన్ కి, మంత్రి పేర్ని నాని కి.. ఈ మీటింగ్ కి పెద్దగా వ్యవహరించిన చిరు కి థాంక్స్ చెప్పారు. అయితే అప్పుడు సమావేశమయినా.. టికెర్ రేట్స్ పెంచుకునే విషయంలో మాట ఇచ్చినా.. జీవో మాత్రం ఏపీ ప్రభుత్వం జారీ చెయ్యలేదు. మధ్యలో భీమ్లా నాయక్ లాంటి సినిమాలొచ్చాయి.. ఏపీ టికెట్ రేట్స్ కి అక్కడ నష్టాలూ చవి చూడాల్సి వచ్చింది.
ఈ రోజు మధ్యాన్నం ప్రభాస్ రాధే శ్యామ్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకునే జీవో ఇస్తే బావుంటుంది.. అది రాధే శ్యామ్ రిలీజ్ కి ముందు జీవో జారీ చేస్తే ఇంకా మంచిది అంటూ మాట్లాడిన కొద్ది సేపటికే ఏపీ సీఎం జగన్ టికెట్ రేట్ పెంపు జీవో పై సంతకం చేసారు. అలా రాధే శ్యామ్ కి ఆ జీవో హెల్ప్ అయ్యింది. బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెరగడంతో.. ప్రభాస్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు. టాలీవుడ్ వర్గాల ఆందోళనని అర్ధం చేసుకుని.. సవరించిన టికెట్ ధరలతో మమ్మల్ని ఆదుకున్నందుకు సీఎం జగన్ గారికి, పేర్ని నాని గారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.