Advertisementt

శర్వా కి మరో లక్కీ హీరోయిన్ తగిలిందా

Mon 07th Mar 2022 08:42 PM
krithi shetty,sharwanand,rashmika,aadavallu meeku joharlu,heroine glamour,lucky heroine  శర్వా కి మరో లక్కీ హీరోయిన్ తగిలిందా
Sharwanand to romance Kriti Shetty? శర్వా కి మరో లక్కీ హీరోయిన్ తగిలిందా
Advertisement
Ads by CJ

వరస ప్లాప్స్ తో అల్లాడుతున్న యంగ్ హీరో శర్వానంద్ కి లక్కీ హీరోయిన్ రష్మిక తోడైనా.. ఫలితం దక్కలేదు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరస సినిమాలతో టాలెంట్ తో పాటుగా గ్లామర్ చూపిస్తున్న రష్మిక లక్కు శర్వా ఆడవాళ్లకు ఏమాత్రం బూస్ట్ ఇవ్వలేదు. రశ్మికని నమ్ముకుని శర్వానంద్ నిండా మునిగాడు. మహా సముద్రం డిజాస్టర్ లిస్ట్ లో ఉంటే.. ఆడవాళ్లు మీకు జోహార్లు ప్లాప్ లిస్ట్ కి చేరింది. ఇక తదుపరి మూవీ ఒకే ఒక జీవితంపై మార్కెట్ లో బజ్ క్రియెట్ అవడం కష్టమే అన్నట్టుగా ఉంది. 

ఇక ఇప్పుడు మరో లక్కీ హీరోయిన్ తో శర్వా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి వరస విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి తో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఈ రోజు ఉదయం నుండే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కృతి శెట్టి నటిస్తున్న వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి షూటింగ్ చివరి దశలో ఉండడంతో.. కృతి శెట్టి శర్వా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో శర్వానంద్ చెయ్యబోయే సినిమాలోనే కృతి హీరోయిన్ గా చెయ్యనున్నట్లుగా టాక్. మరి ఈ లక్కీ బ్యూటీ అయినా శర్వా కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Sharwanand to romance Kriti Shetty?:

Krithi Shetty to pair up with Sharwanand?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ