Advertisementt

ఏజెంట్ లో మెగాస్టార్ స్పెషల్ రోల్

Mon 07th Mar 2022 02:34 PM
malayalam megastar,mammotty,akhil akkineni,surender reddy,anil sunkara,agent movie  ఏజెంట్ లో మెగాస్టార్ స్పెషల్ రోల్
Mammotty Joins Akhil Agent ఏజెంట్ లో మెగాస్టార్ స్పెషల్ రోల్
Advertisement
Ads by CJ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తన తదుపరి మూవీ ని మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా కోసం సూపర్ మేకోవర్ అయిన అఖిల్ ఈ సినిమా కోసం రఫ్ గా, సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారాడు. ఏజెంట్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచిన అక్కినేని కుర్రాడు కి తోడుగా ఇప్పుడు మలయాళ పవర్ ఫుల్ నటుడు మమ్ముట్టి జాయిన్ అయ్యారు. అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు. 

మమ్ముట్టి ఏజెంట్ షూట్ లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు. చేతిలో గన్ తో నెత్తి మీద టోపీ తో మమ్ముట్టి పవర్ ఫుల్ సోల్జర్ లా, డిసిప్లిన్ తో, డెడికేషన్ ఉన్న ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మరి రా ఏజెంట్ గా కనిపిస్తున్న అఖిల్ కి పవర్ ఫుల్ లుక్ లో ఉన్న మమ్ముట్టి కి ఎలాంటి కనెక్షన్ ఉంటుందో.. ఒకరికొకరు ఎక్కడ కలుసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో ముంబై మోడల్ సాక్షి అఖిల్ తో రొమాన్స్ చేస్తుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ లో బిజీగా వున్నారు. 

Mammotty Joins Akhil Agent:

Malayalam Megastar Mammotty Joins Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara Crazy Project Agent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ