లక్కీ హీరోయిన్ గా వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న రష్మిక.. బాలీవుడ్, టాలీవుడ్, పాన్ ఇండియా మార్కెట్ లోను సత్తా చాటుతుంది. మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్ గా మారిన రష్మిక లక్ కూడా ఓ యంగ్ హీరోకి పని చెయ్యలేదు. వరస ప్లాప్స్ తో ఉన్న ఆ యంగ్ హీరోకి రష్మిక అదృష్టం అంటుకోలేదు సరి కదా.. మరో ప్లాప్ వచ్చి పడింది. గతకొన్నేళ్లుగా సక్సెస్ కి దూరమైన శర్వానంద్ చివరికి సక్సెస్ ఫుల్ హెఓరోయిన్ రశ్మికని నమ్ముకుని ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కానీ రష్మిక లక్కు, డైరెక్టర్ మ్యాజిమ్, హీరో నమ్మకాన్ని ఆ సినిమా నిలబెట్టలేకపోయింది.
గత శుక్రవారం విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకి సో సో టాక్ కూడా కాదు డివైడ్ టాక్ పడింది. భారీ ప్రమోషన్స్, రష్మిక గ్లామర్ లాంటి ప్లస్ లు ఉన్న ఈ సినిమాలో రొటీన్ స్టోరీ, ఆడవాళ్ళ భజన ఎక్కువవడం వంటి అంశాలతో ప్లాప్ టాక్ పడింది. దానితో సినిమా ప్లాప్ అయ్యింది. రోజు రోజుకి కలెక్షన్స్ కూడా పడిపోతున్నాయి. వరస ప్లాప్స్ లో ఉన్న శర్వాకి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు మరో ప్లాప్ ని అంటగట్టింది. రష్మిక గ్లామర్, ఆమె లక్కు కూడా శర్వా ని కాపాడలేకపోయాయి.