బుల్లితెర మీద లేడీ యాంకర్స్ తో సమానమైన పాపులారిటీ ఉన్న యాంకర్ రవి బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఆ పాపులారిటీ మరింతగా పెంచుకున్నాడు. బిగ్ బాస్ లో సెటిల్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రవి అనూహ్యంగా మధ్యలోనే బయటికి వచ్చేసాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ రవి ని నామినేట్ చేసి ఏలిమినేట్ చేసారు హౌస్ మేట్స్. అయితే టైటిల్ ఫెవరెట్ గా ఉన్న యాంకర్ రవి అలా ఫైనల్స్ కి చాలా దగ్గరలోనే బయటికి రావడం అతని ఫాన్స్ తట్టుకోలేక ఆందోళనలు కూడా చేసారు. అందుకేనేమో ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం యాంకర్ రవికి న్యాయం చేసింది.
అదెలా అంటే.. ప్రెజెంట్ బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో నాన్ స్టొప్ గా రన్ అవుతుంది. ఆ షో నుండి మొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది. బిగ్ బాస్ ఓటిటినుండి ముమైత్ ఖాన్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. అయితే అలా ఎలిమినేట్ అయిన ముమైత్ ని బిగ్ బియాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరో కాదు యాంకర్ రవి నే. యాంకర్ రవికి బిగ్ బాస్ ఇంటర్వ్యూ లో యాంకరింగ్ అవకాశం ఇచ్చారు. గతంలో ఈ బజ్ షో కి తనీష్, రాహుల్ సిప్లిగంజ్, అరియనా గ్లోరీలు ఇంటర్వ్యూలు చెయ్యగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రవి చేరాడు.