పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ కి దగ్గరలో ఉంది. అదృష్టం తో పాటుగా గ్లామర్ ఆమెని స్టార్ హీరోయిన్ ని చేసింది. కోలీవుడ్, బాలీవుడ్ రెండు భాషల్లో ఆమెకి ప్లాప్ లు పలకరిస్తే.. పూజ కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. వరుణ్ తేజ్ ముకుంద సినిమాలో పూజ హెగ్డే క్యూట్ గా ట్రెడిషనల్ గా లంగా వోణీల్లో కనిపించి సందడి చేసింది. ఆ సినిమాలో ఆమె ఎలాంటి గ్లామర్ చూపించలేదు. అలాగే నాగ చైతన్య తో నటించిన ఓ లైలా సినిమాలోనూ ట్రెడిషనల్ లుక్స్ తోనే ఆకట్టుకుంది. కానీ అప్పుడు ఆమెకి ఆ సినిమాలు స్టార్ రేంజ్ ని కట్టబెట్టలేదు. ఎప్పుడైతే హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో గ్లామర్ గా స్టెప్పులు వేసిందో అప్పుడే అమ్మడు సుడి తిరిగింది.
ఆ తర్వాత మహేష్ బాబు, యంగ్ టైగర్, అల్లు అర్జున్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. రీసెంట్ గా ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యామ్ పాన్ ఇండియా ఫిలిం మార్చ్ 11 న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ సినిమా ఇంటర్వ్యూలో మట్లాడుతూ పూజ హెగ్డే తన గ్లామర్ విషయం మాట్లాడింది. ప్రభాస్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది అన్న పూజ హెగ్డే ముకుంద టైం లో తాను గ్లామర్ పాత్రలకి సరిపోను, సూట్ కాను అన్నారు. కానీ డీజే సినిమాలో నేను చేసిన గ్లామర్ షో చూసాక అందరూ అభిప్రాయం మార్చుకున్నారు అంటూ మాట్లాడింది. అయితే ఇప్పుడు తనకి విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉంది అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది.