రెండేళ్లు కాలాన్ని కోవిడ్ మహమ్మారి వృధా చేసింది. సినిమా వాళ్ళకి షూటింగ్స్ లేవు.. ఫుల్ గా బ్రేక్ వచ్చినా వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యనియ్యలేదు. గత ఏడాది ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తవ్వగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో పారిస్ ట్రిప్ వేశారు. కానీ రామ్ చరణ్ వెంటనే RC 15 షూటింగ్ లో జాయిన్ అవడం, మధ్యలో బిజినెస్ వ్యవహారాలతో బిజీ అవడంతో.. ఆయన భార్య ఉపాసనతో కలిసి ఎక్కడికి వెకేషన్ కి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు RC15 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ హైదరాబాద్ కి వచ్చేసారు.
అటు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి కొద్దిగా గ్యాప్ దొరింది. ఇటు కరోనా కూడా తగ్గుముఖం పట్టింది. దానితో రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఓ వెకేషన్ ప్లాన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేసారు. అయితే వారు ఎక్కడి వెళుతున్నారో అనేది తెలియదు కానీ Finally a vacation after 2 years ! Thank u Mr C ♥️♥️🤗🤗@AlwaysRamCharan అంటూ ఉపాసన రెండేళ్ల తర్వాత తనని వెకేషన్స్ కి తీసుకెళుతున్న తన భర్త మిస్టర్ సి కి థాంక్స్ చెప్పింది. పాపం రామ్ చరణ్ కోవిడ్, బిజీ షెడ్యూల్స్ వలన రెండేళ్లు ఇలా వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యలేకపోయాడంటూ ఫాన్స్ ఫీలైపోతున్నారు.