అల్లు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంటర్ అయ్యి.. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోగా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్.. వ్యక్తిగతంగా ప్రేమించిన అమ్మాయి స్నేహని వివాహం చేసుకుని పరిపూర్ణమైన జీవితంలోకి అడుగుపెట్టి ఇద్దరి బిడ్డలకి తండ్రిగా మారాడు. అయాన్, అర్హ లతో అల్లు అర్జున్ పంచుకునే ప్రేమని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే అల్లు అర్జున్.. తాజాగా తన భార్య స్నేహతో సెలెబ్రేట్ చేసుకున్న వెడ్డింగ్ డే సెలెబ్రేషన్స్ ఫోటో ని షేర్ చేసారు.
అల్లు అర్జున్- స్నేహని వివాహం చేసుకుని 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన తన 11 వ పెళ్లి రోజుని భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హ తో కలిసి నవ్వుతూ కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ కి గ్యాప్ వస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేసే అల్లు అర్జున్ తరచూ వెకేషన్స్ కి వెళుతుంటారు. ప్రేమించి పెళ్లాడిన భార్యని ఆయన అపురూపంగా చూసుకుంటారు. అల్లు అర్జున్, స్నేహ, అయాన్, అర్హ క్యూట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పిక్ చూసిన వారంతా 11 ఏళ్ళ ప్రేమని చూపించారుగా అంటున్నారు.