డైరెక్టర్ అయినా, హీరో అయినా వరసగా రెండుసార్లు బ్లాక్ బస్టర్ కొడితే వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. మర్కెట్ లో వారి సినిమాలకి గిరాకీ పెరిగిపోతుంది. హీరోలైతే పారితోషకాన్ని చుక్కల్లో చూపిస్తారు. డైరెక్టర్స్ అయితే అప్పటివరకు తాము అందుకున్న దానికి డబుల్ పేమెంట్ నిర్మాతల నుండి వసూలు చేస్తారు. ఇప్పడు అదే లాజిక్ ని దర్శకుడు త్రివిక్రమ్ వాడుతున్నారు. వరసగా నీకా నాకా అన్నట్టు పెద్ద హిట్స్ ఇచ్చారు. బన్నీకి అలా వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ కి అదే రేంజ్ లో భీమ్లా నాయక్ హిట్ ని అందించారు. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడికి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
అందుకే ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే SSMB28 మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ అందుకుంటున్న పారితోషకాన్ని సరిసమానమైన పారితోషకం అందుకోబోతున్నారట. మహేష్ తో సమానమైన పారితోషకం అంటే మాములు విషయం కాదు. మహేష్ - పూజ హెగ్డే కాంబోలో ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న SSMB28 ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ అక్షరాలా 50 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఆలా వైకుంఠపురములో అప్పుడే 25 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇప్పుడు దానికి డబుల్ చేసి SSMB28 కి వసూలు చేయబోతున్నారట. మరి అందుకే అనేది బ్లాక్ బస్టర్ హిట్ పడితే అంతేగా.. అంతేగా అని.