పవన్ కళ్యాణ్ - రానా భీమ్లా నాయక్ కలెక్షన్స్ ఏపీలో తక్కువ టికెట్ రేట్స్ కారణంగా దారుణంగా ఉంటే.. తెలంగాణాలో ఆశాజనంగా ఉన్నాయి. నైజాం లో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉంది. ఆంధ్రలో కష్టాలు తప్పేలా లేవు. అయితే గత వారం రిలీజ్ అయిన భీమ్లా నాయక్ కి ఈ వారం కూడా ప్లస్ అయ్యింది. ఈ వారం రిలీజ్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ సినిమాలు సో సో టాక్ తెచ్చుకోవడంతో.. భీమ్లా నాయక్ కి కలిసొచ్చి.. కలెక్షన్స్ పెరిగాయి. మరి ఎంతగా కలెక్షన్స్ పుంజుకున్నా.. ఆంధ్రలో అయితే భీమ్లా బయ్యర్లకు నష్టాలూ మాత్రం తప్పవు.
ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం - 33.78
సీడెడ్ - 10.46
ఉత్తరాంధ్ర - 7.17
ఈస్ట్ గోదావరి - 5.18
వెస్ట్ గోదావరి - 4.75
గుంటూరు - 4.95
కృష్ణా - 3.52
నెల్లూరు - 2.40
ఏపీ, తెలంగాణ 9 డేస్ కలెక్షన్స్ - 72.21 కోట్లు
ఇతర ప్రాంతాలు - 7.90
ఓవర్సీస్ - 11.85
వరల్డ్ వైడ్ 9 డేస్ కలెక్షన్స్ - 91.96 కోట్లు