ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ టెంక్షన్ లో ఉన్నారు. రాధే శ్యామ్ రిలీజ్ అవ్వగానే.. ఓ వారం గ్యాప్ లో ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే తో పాటుగా సలార్ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతారు. అయితే వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్న ప్రభాస్ షాకింగ్ గా దర్శకుడు మారుతి తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారనే న్యూస్ చూడగానే ప్రభాస్ ఫాన్స్ ఖంగు తిన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ డీలక్స్ రాజాగా మారబోతున్నారని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నారని, అందులో ఓ హీరోయిన్ గా కోలీవుడ్ క్రేజీ భామ మాళవిక మోహన్ నటించబోతుంది అంటూ ఒకదాని తర్వాత మరొకటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ప్రభాస్ - మారుతి డీలక్స్ రాజా ముహూర్తానికి ముహూర్తం కూడా పెట్టారని తెలుస్తుంది. అది ఏప్రిల్ 10న పూజ కార్యక్రమాలతో ఈ కాంబో మూవీ మొదలు కాబోతుంది అని, ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ లో మేజర్ పార్ట్ చిత్రీకరణ జరగబోతుంది అని, అందుకే స్క్రిప్ట్ నచ్చిన ప్రభాస్ కూడా వెంటనే ఈ మూవీ చెయ్యడానికి ఓకె చెప్పారని అంటున్నారు. సో ప్రభాస్ - మారుతి మూవీ ఏప్రిల్ 10 న అఫీషియల్ గా పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది.