Advertisementt

రామ్ చరణ్ కి రాజమౌళి పిలుపు

Sun 06th Mar 2022 11:51 AM
ram charan,rrr movie,young tiger ntr,rajamouli,rrr promotions,rc 15 shooting  రామ్ చరణ్ కి రాజమౌళి పిలుపు
Rajamouli calls Ram Charan రామ్ చరణ్ కి రాజమౌళి పిలుపు
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో మరోసారి మోత మోగించబోతున్నారు. గత డిసెంబర్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో  అటు మీడియా, ఇటు సోషల్ మీడియాని గ్రిప్ లో పెట్టుకున్న రాజమౌళి.. ఈసారి కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ అవడమే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేలా చూసుకుంటున్నారు. అయితే అటు కొమరం భీం ఎన్టీఆర్ అయితే కొత్త సినిమా ఏది మొదలు పెట్టకుండా ఇంకా ఫ్రీ గానే ఉన్నారు. దానితో ఆయన రాజమౌళికి అందుబాటులో ఉన్నట్లే. కానీ రామ్ చరణ్ మాత్రం RC15  షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లారు. అక్కడ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కీలక షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. హీరోయిన్ కియారా, శ్రీకాంత్, అంజలి, రామ్ చరణ్ ఇలా కీలక పాత్రల మీద శంకర్ RC15 చిత్రీకరణలో ఉన్నారు. 

RC15 షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ కి రాజమౌళి నుండి పిలుపు రావడంతో రామ్ చరణ్ అటు శంకర్ షెడ్యూల్ ముగించేసి.. హైదరాబాద్ కి వచ్చేసారు. రాజమండ్రి నుండి రామ్ చరణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ రెండు రోజుల రెస్ట్ తో రామ్ చరణ్ మళ్ళీ రాజమౌళి తో జాయిన్ కాబోతున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ నుండి ఎవరూ చూపు తిప్పుకోలేకపోయారు. వారి బాండింగ్, వారి స్నేహం ఆ ప్రమోషన్స్ లో అంతగా హైలెట్ అయ్యింది. మరి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఎంత డిఫరెంట్ గా ప్లాన్ చేసారో చూడాలి.

Rajamouli calls Ram Charan:

RRR team to kick start the promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ