టికెట్ రేట్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గందరగోళంగా తయారైంది. ఆంధ్రాలో మరీ దారుణంగా కోత విధిస్తే.. తెలంగాణాలో ధరల మోత మోగిపోతోంది. సింగిల్ స్క్రీన్స్ కి 175, మల్టీప్లెక్సులకి 295 వరకు గరిష్ట టికెట్ ధర పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అందులోనూ రోజుకి ఐదు షోలు వేసుకునే అనుమతి కూడా లభించడంతో భీమ్లా నాయక్ మొదటి ఐదు రోజుల్లోనే అందినంత లాగేసింది. కేవలం ఈ టికెట్ రేట్ల తేడా వల్లే మొదటివారంలోనే నైజాంలో 30 కోట్ల వరకు కొల్లగొట్టిన భీమ్లాకి ఆంధ్రా లెక్కల్లో మాత్రం చుక్కెదురైంది. సరే.. ఆ వివాదం అందరికీ తెలిసిందే. సోమవారం నాడు కొత్త జీవో ప్రకటిస్తారని అంటున్నారు కనుక అక్కడ ధరల పెరుగుదల ఏ మేరకు ఉంటుందో చూద్దాం.
ఇక హైద్రాబాదులో మాత్రం మరీ అత్యాశకు పోయినట్టుగా రేట్లు పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి మూడు రోజులకూ పెంచితే ఆ తిప్పలేవో ఫ్యాన్స్ పడతారు. మొదటివారం మొత్తం ఉంచితే ఆర్ధిక స్తోమత కలిగిన ప్రేక్షకులు వెళతారు. కానీ రెండో వారం కూడా అదే రేట్స్ మెయిన్ టైన్ చేస్తే ఆసక్తి ఉన్న మిడిల్ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చేదెలా అనే వాదన బాగా బలంగా వినిపిస్తోంది. ఆ కారణం చేతనే భీమ్లా నాయక్ రెవెన్యూకి రెండో వారం బ్యాండ్ పడిందని పవన్ కళ్యాణ్ అభిమానులే గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు అదే రేట్స్ తో రాధే శ్యామ్ బుకింగ్ ఓపెన్ అవుతూ ఉండడం, మంత్ ఎండ్ లో వచ్చే ఆర్ ఆర్ ఆర్ కీ ఇవే రేట్స్ వర్తిస్తాయని తెలియడంతో అసలు అంతటి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాలకి ఎలాట్ చేసిన రేట్స్ ని ఏ బేసిస్ లో భీమ్లా కి పెట్టారంటూ విమర్శకులు రాజకీయ కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు.
నిజమే కదా.. క్రేజునీ, ఇమేజునీ క్యాష్ చేసుకోవడమే ముఖ్యం అనుకుంటే
వందల కోట్ల బడ్జెట్టు, పాన్ ఇండియా ప్రాజెక్టు అని చెప్పుకోవడం వేస్ట్ ఇంక.!
డేట్లు పంచుకుంటూ - రేట్లు పెంచుకుంటూ - కోట్లు నొల్లుకుంటూ వెళ్లిపోవడమే.!