Advertisementt

చరణ్ - అలియా మళ్ళీ మళ్ళీ

Sat 05th Mar 2022 10:52 AM
ram charan,frooti ad,alia bhatt,alia bhatt and ram charan  చరణ్ - అలియా మళ్ళీ మళ్ళీ
Alia Bhatt and Ram Charan will be seen sharing screen చరణ్ - అలియా మళ్ళీ మళ్ళీ
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మొదటిసారి నటించారు. అదే అలియా భట్ కి ఫస్ట్ సౌత్ మూవీ. ఆర్.ఆర్.ఆర్ లో సీత గా అలియా భట్ అల్లూరి సీత రామరాజు పక్కన  కనిపించబోతుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అలియా భట్ కి ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చేసింది. NTR30 లో కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతుంది అలియా భట్. అయితే ఇంకా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ రామ్ చరణ్ తో మరోసారి కలిసి నటించే ఛాన్స్ అందుకుంది అలియా భట్. అది RC15 లో చరణ్ తో కియారా రొమాన్స్ చేస్తుంది.

మరి జెర్సీ డైరెక్టర్ తో చరణ్ చేసే RC16 లో అలియా భట్ నటిస్తుంది అనుకుంటున్నారేమో.. అదేం లేదు. చరణ్ - అలియా భట్ కలిస్ ఓ యాడ్ లో నటించారు. రామ్ చరణ్ అటు నిర్మాతగానూ, ఇటు హీరోగా, అలాగే మధ్యలో బిజినెస్ లు చక్కబెడుతున్నారు. మరోపక్క కమర్షియల్ యాడ్స్ లోను చరణ్ నటిస్తున్నారు . రీసెంట్ గా చరణ్ ఫ్రూటీ యాడ్ లో అలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సమ్మర్ మొదలవడంతో.. కూల్ డ్రింక్స్, ఇలాంటి జ్యుస్ కంపెనీలు.. తమ ప్రొడక్ట్స్ ని మర్కెట్ లో పాపులర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కమర్షియల్ యాడ్స్ చేసి పబ్లిసిటీ చేసినట్లుగా పార్లే అగ్రో సంస్థ రూపొందిస్తున్న ఫ్రూటీ యాడ్‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఈ యాడ్ లోనే చరణ్ - అలియా భట్ కలిసి మరోసారి నటించారన్నమాట. గతంలో ఈ ఫ్రూటీ యాడ్ లో అలియా భట్ - అల్లు అర్జున్ కలిసి నటించారు.

Alia Bhatt and Ram Charan will be seen sharing screen:

Ram Charan roped in as the brand ambassador of Frooti

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ